ఎడ్లబండిని ఢీకొన్న వ్యాన్
– రెండు ఎడ్లు మృతి, ఒకరికి గాయాలు
సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండల శివారులోని జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండు ఎడ్లు మృతి చెందగా, ఒకరికి గాయాలయ్యాయి. సదాశివనగర్‌కు చెందిన బన్నీ అనే వ్యక్తి గాయత్రి షుగర్స్ ఫ్యాక్టరీకి చెరుకును ఎడ్లబండిపై తరలిస్తుండగా నిజామాబాద్ నుంచి హైదరాబాద్‌కు అతివేగంతో వెళ్తున్న ఐచర్‌వ్యాన్ ఎడ్లబండిని ఢీకొన్నది. ప్రమాదంలో రెండు ఎడ్లు అక్కడికక్కడే మృతి చెందగా, బండిపై ఉన్న బన్నీకి గాయాలయ్యాయి. మృతి చెందిన గేదెల విలువ రూ. 2లక్షల వరకు ఉంటుందని బాధితుడు పేర్కొన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


