నూతన విద్యావిధానాన్ని రద్దు చేయాలి
ఖలీల్‌వాడి : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని టీటీడీ కల్యాణ మండలంలో బుధవారం నిర్వహించిన ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర 4వ మహాసభలకు ఆయన హాజరై మాట్లాడారు. ముందుగా ఎన్టీఆర్ చౌరస్తా నుంచి టీటీడీ కల్యాణ మండపం వరకు నిర్వహించిన ర్యాలీని ఏఐఎస్‌ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి దినేశ్ శివలింగరాజన్ జెండా ఊపి ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యార్థుల సమస్యలపై ఏఐఎస్‌ఎఫ్ అలుపెరుగని పోరాటాలు చేస్తోందన్నారు. అన్ని విద్యార్థి సంఘాలకు మాతృ సంస్థ ఏఐఎస్‌ఎఫ్ అని అన్నారు. ఎందరో నాయకులు ఈ విద్యార్థి సంఘం ద్వారా ఎదిగారని, తాను కూడా ఈ సంఘం ద్వారా నాయకత్వ లక్షణాలు అలవర్చుకొని ఎమ్మెల్యేగా ఎదిగినట్లు చెప్పారు. మార్కుల కోసం కాకుండా జ్ఞానం పెంపొందించే దిశగా విద్యా విధానం ఉండాలన్నారు. జిల్లాలో రాష్ట్ర మహాసభలను మూడు రోజుల పాటు గొప్పగా నిర్వహించడం సంతోషకరమైన విషయమని అన్నారు.
ముఖ్య అతిథిగా హాజరైన ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ మాట్లాడుతూ.. దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి తోడ్పాటు అందిస్తోందన్నారు. ఏఐఎస్‌ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి దినేశ్ శివలింగరాజన్ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యను ప్రైవేటీకరణ చేసేందుకు అడుగులు వేస్తున్నాయని, ఇది సరైన నిర్ణయం కాదన్నారు. కార్యక్రమంలో జాతీయ మాజీ అధ్యక్షుడు తక్కెలపల్లి శ్రీనివాస్‌రావు, రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు మణికంఠరెడ్డి, పుట్ట లక్ష్మణ్, రాష్ట్ర సహాయ కార్యదర్శి బనోతు రఘురాం, జిల్లా అధ్యక్షుడు సుభోద్, రాష్ట్ర నాయకుడు కంజర భూమయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి పీ సుధాకర్, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి వై ఓమయ్య, ఏఐఎస్‌ఎఫ్ ఆఫీస్ బేరర్స్ ఇటికెల రామకృష్ణ, గ్యార నరేశ్, రెహమాన్, కాసోజు నాగజ్యోతి, బరిగేలా వెంకటేశ్, రాజారెడ్డి, రాజేశ్వర్, రాజన్న, స్వరూపరాణి, విఠల్ గౌడ్, దశరథ్ తదితరులు పాల్గొన్నారు.
భగత్‌సింగ్ స్ఫూర్తితో విద్యార్థులు
ఉద్యమించాలి
కొత్తగూడెం ఎమ్మెల్యే
కూనంనేని సాంబశివరావు
జిల్లా కేంద్రంలో ప్రారంభమైన
ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర మహాసభలు
నూతన విద్యావిధానాన్ని రద్దు చేయాలి
నూతన విద్యావిధానాన్ని రద్దు చేయాలి
నూతన విద్యావిధానాన్ని రద్దు చేయాలి


