ఆంగ్ల భాష నైపుణ్యం ఎంతో అవసరం | - | Sakshi
Sakshi News home page

ఆంగ్ల భాష నైపుణ్యం ఎంతో అవసరం

Feb 19 2026 9:43 AM | Updated on Feb 19 2026 9:43 AM

ఆంగ్ల భాష నైపుణ్యం ఎంతో అవసరం

ఆంగ్ల భాష నైపుణ్యం ఎంతో అవసరం

వర్సిటీ ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ రాంబాబు

తెయూ(డిచ్‌పల్లి): ప్రపంచం కుగ్రామంగా మారిన నేటి సమాజంలో ప్రతి ఒక్కరికి ఆంగ్ల భాషా నైపుణ్యం ఎంతో అవసరమని తెలంగాణ యూనివర్సిటీ ప్రిన్సిపాల్‌ జీ రాంబాబు పేర్కొన్నారు. తెలంగాణ యూనివర్సిటీ సెంటర్‌ ఫర్‌ ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ ట్రైనింగ్‌ ఆధ్వర్యంలో వర్సిటీలో పని చేస్తున్న బోధనేతర సిబ్బందికి బుధవారం ఆంగ్లంలో ప్రత్యేక శిక్షణ తరగతులను ప్రిన్సిపాల్‌ రాంబాబు ప్రారంభించారు. ఆంగ్ల భాషా నైపుణ్యాలు మానవ సంబంధాలనే కాకుండా వృత్తి నైపుణ్యాలను వెలికి తీస్తాయని అన్నారు. కార్యక్రమలలో వైస్‌ ప్రిన్సిపాల్‌ సీహెచ్‌ లక్ష్మణ చక్రవర్తి, సెల్ట్‌ డైరెక్టర్‌ పీ సమత, పీఆర్‌వో కేవీరమణాచారి, అధ్యాపకులు ఎల్‌ జ్యోత్స్న, ఎన్‌ స్వామి, బోధనేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement