కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించిన సీపీ
సుభాష్‌నగర్: నగరంలోని పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రా లు, స్ట్రాంగ్ రూమ్‌లను సీపీ సాయి చైతన్య బుధవారం పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా చ ర్యలు చేపట్టాలని ఆదేశించారు. స్ట్రాంగ్ రూ మ్‌లు, కౌంటింగ్ కేంద్రాల వద్ద నిరంతర నిఘా కోసం అదనపు సీసీ కెమెరాలను ఏ ర్పాటు చేశామని తెలిపారు. కౌంటింగ్ ప్రక్రి య ముగిసే వరకు నిజామాబాద్, బోధన్, ఆర్మూర్, భీమ్‌గల్ ప్రాంతాల్లో సెక్షన్ 163 బీఎన్‌ఎస్ అమలులో ఉంటుందని, ఐదుగు రి కంటే ఎక్కువ మంది గుమిగూడకూడదని సీపీ స్పష్టం చేశారు. నిబంధనలను ఉల్లంఘిస్తే నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సీపీ వెంట అదనపు డీసీపీ (అడ్మిన్) బస్వారెడ్డి, నిజామాబాద్ ఏసీపీ ప్రకాశ్, టౌన్ సీఐ శ్రీనివాసరాజ్, 3వ టౌన్ ఎస్‌ఐ హరిబాబు, ఎన్నికల పరిశీలకులు ఉన్నారు.
కామారెడ్డి జిల్లాలో 69.48శాతం పోలింగ్
● బిచ్కుందలో అత్యధికం..
కామారెడ్డిలో అత్యల్పం
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : చెదురుమదురు సంఘటనలు మినహా కామారెడ్డి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద మున్సిపాలిటీల్లో 92 వార్డులుండగా.. 447 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కామారెడ్డిలో 65.94 శాతం, ఎల్లారెడ్డిలో 79.77, బాన్సువాడలో 73.66, మొదటిసారి ఎన్నిక జరుగుతున్న బిచ్కుందలో 78.49 శాతం పోలింగ్ నమోదైంది. అక్కడక్కడ ఆయా పార్టీల మధ్య వాగ్వాదాలు జరగడంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. కామారెడ్డి పట్టణంలో కవరేజీకి వెళ్లిన మీడియాకు పోలీసులు అడుగడుగునా అడ్డంకులు కల్పించారు. పోలింగ్ కేంద్రాల్లో బారులు తీరిన ఓటర్ల ఫొటోలు తీయడానికి అనుమతి ఇవ్వలేదు.
పీహెచ్‌సీల్లో ప్రసవాలు జరిగేలా చూడాలి
నందిపేట్(ఆర్మూర్): గర్భిణుల వివరాలు నమోదు చేసి పీహెచ్‌సీ కేంద్రాలలో ప్రసవాలయ్యేలా చూడాలని డీఎంహెచ్‌వో రాజశ్రీ సూచించారు. నందిపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె బు ధవారం తనిఖీ చేశారు. ఆస్పత్రి పరిసరా లు, రికార్డులను పరిశీలించారు. అనంతరం కుద్వాన్‌పూర్ గ్రామంలోని పల్లె దవా ఖాన ను పరిశీలించారు. ఎంసీహెచ్, ఎన్‌సీడీ, షుగర్, బీపీ, క్యాన్సర్ ఉన్నవారిని గుర్తించి ఇంటింటికి వెళ్లి మందులు ఇవ్వాలని సూచించారు. ఆమె వెంట డాక్టర్ స్వాతి, సూపర్‌వైజర్ భాస్కర్, సిబ్బంది ఉన్నారు.
కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించిన సీపీ


