మార్చిలో ఎకో టూరిజం పనులు! | - | Sakshi
Sakshi News home page

మార్చిలో ఎకో టూరిజం పనులు!

Feb 13 2026 5:23 AM | Updated on Feb 13 2026 5:23 AM

మార్చిలో ఎకో టూరిజం పనులు!

మార్చిలో ఎకో టూరిజం పనులు!

డొంకేశ్వర్‌(ఆర్మూర్‌): జిల్లాలో ఎస్సారెస్పీ బ్యాక్‌వాటర్‌ ప్రాంతంలో ఎకో టూరిజం పనులు త్వరలో ప్రారంభం కానున్నట్లు అటవీ శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. అనుకున్నట్లుగా అన్ని జరిగితే రానున్న మార్చిలోనే మొదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపారు. డొంకేశ్వర్‌ మండలం చిన్నయానం, గాదేపల్లి వద్ద బ్యాక్‌వాటర్‌ ప్రాంతాన్ని రాష్ట్ర ఫారెస్ట్‌ డెవలప్‌మెంట్‌ డైరెక్టర్‌ రంజిత్‌ నాయక్‌ డీఎఫ్‌డీవో వికాస్‌ మీనా, అర్కిటెక్చర్‌ పృథ్వీలతో కలిసి గురువారం పరిశీలించారు. వాచ్‌టవర్లు, రిసార్టు లు, విశ్రాంతి గదులు, పార్కింగ్‌ ఏరియా ఎక్కడెక్కడ పెట్టాలో మరోసారి చర్చించారు. మ్యాపులు, ప్లాన్‌లు అన్ని సిద్ధంగా ఉన్న నేపథ్యంలో పనులు ఎప్పుడైనా ప్రారంభం కావొచ్చన్నారు. స్థానిక గ్రామాలకు ఉపాధి కల్పించేలా నేచర్‌ గైడ్‌ల నియామకానికి కసరత్తు జరుగుతోందన్నారు. ఇందుకు కొంతమంది యువకులను పిలిచి వారితో మాట్లాడారు. త్వరలోనే హైదరాబాద్‌లో 20 రోజులపాటు శిక్షణ ఉంటుందని, ప్రభుత్వమే అన్ని వసతులు కల్పిస్తుందని తెలిపారు. పనుల్లో కూడా స్థానికులకే అవకాశం కల్పిస్తామని స్పష్టం చేశారు. వన సంరక్షణ కమిటీలో కూడా స్థానికులనే ఉంచుతామని ఇందులో చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ కలిపి మొత్తం 15 మంది సభ్యులు ఉంటారన్నారు. ఆరు నెలల్లో ఎకో టూరిజం పూర్తిగా ఏర్పడి పర్యాటకుల సందడి నెలకొంటుందని చెప్పారు. అధికారుల వెంట ఆర్మూర్‌ ఎఫ్‌డీవో భవానీ శంకర్‌, ఎఫ్‌డీసీ అధికారులు శ్రీనివాస్‌, శిరీష, డిప్యూటీ ఎఫ్‌ఆర్వో సుధాకర్‌, గాదేపల్లి సర్పంచ్‌ చిన్నారెడ్డి ఉన్నారు.

కసరత్తు తుది దశకు చేరుకున్నట్లు

అధికారుల వెల్లడి

గాదేపల్లి బ్యాక్‌వాటర్‌ ప్రాంతాన్ని

పరిశీలించిన ఎఫ్‌డీసీ డైరెక్టర్‌

రంజిత్‌ నాయక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement