జిల్లా జైలులో మెగా ఆరోగ్య శిబిరం | - | Sakshi
Sakshi News home page

జిల్లా జైలులో మెగా ఆరోగ్య శిబిరం

Apr 4 2026 7:19 AM | Updated on Apr 4 2026 7:19 AM

నిజామాబాద్‌ అర్బన్‌: జిల్లా జైలులో శుక్రవారం జైలు సూపరింటెండెంట్‌ అశోక్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఉచిత మెగా ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా వెల్‌నెస్‌ ఆస్పత్రి ఆధ్వర్యంలో ఖైదీలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. అలాగే ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించారు. 331 మంది ఖైదీలకు గుండె సంబంధిత, గైనిక్‌, ఆర్థోఫెడిక్‌, జనరల్‌ మెడిసిన్‌ పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో జైలర్‌ శ్రీనివాస్‌, డిప్యూటీ జైలర్‌ మన్మథ్‌ రావు, డాక్టర్లు ప్రశాంత్‌రెడ్డి, అపర్ణ, మమత తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement