అనారోగ్య సమస్యలతో యువతి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

అనారోగ్య సమస్యలతో యువతి ఆత్మహత్య

Apr 4 2026 7:19 AM | Updated on Apr 4 2026 7:19 AM

అనారోగ్య సమస్యలతో యువతి ఆత్మహత్య మద్యం మత్తులో ఒకరు..

కమ్మర్‌పల్లి(భీమ్‌గల్‌): అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఓ యువతి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై సీహెచ్‌ తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం.. భీమ్‌గల్‌ పట్టణంలోని శ్రీరామ్‌నగర్‌ కాలనీలో మొర్రి రాజు, పుష్ప అనే దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమార్తె ప్రళవి (23) అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది. శుక్రవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన కుటుంబీకులు ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు.

రుద్రూర్‌: మద్యం మత్తులో ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటన పొతంగల్‌ మండలం జల్లాపల్లి ఫారంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సంతోష్‌ (35) అనే యువకుడు ఇటీవల మద్యానికి బానిసయ్యాడు. శుక్రవారం రాత్రి మద్యం మత్తులో గ్రామ చౌరస్తాలో ఉన్న గాంధీ విగ్రహానికి ఉన్న కర్రకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

పేకాట స్థావరంపై దాడి

నిజామాబాద్‌ అర్బన్‌: నగరంలోని గౌతమ్‌నగర్‌లో పేకాట స్థావరంపై మూడో టౌన్‌ పోలీసులు దాడి చేశారు. పేకాట ఆడుతున్న ఏడుగురిని అరెస్టు చేసి వారి నుంచి రూ. 6,200 నగదు, ఆరు సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా పేకాట ఆడితే చర్యలు తప్పవని మూడో టౌన్‌ ఎస్సై హరిబాబు హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement