భిక్కనూరు: పెద్దమల్లారెడ్డి సింగిల్‌విండో మాజీ చైర్మన్, కాంగ్రెస్ నాయకుడు రాజాగౌడ్ తల్లి బుచ్చమ్మ(75) గుండెపోటుతో శుక్రవారం మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న విద్యా దాత తిమ్మయ్యగారి సుభాష్‌రెడ్డి పెద్దమల్లారెడ్డికి వచ్చి బుచ్చమ్మ మృతదేహం వద్ద నివాళులర్పించారు. వారి కుటుంబీకులను పరామర్శించారు. బుచ్చమ్మ మరణవార్త తెలుసుకున్న ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ ఫోన్‌లో రాజాగౌడ్‌ను పరమర్శించి ఓదార్చారు. అలాగే గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్‌రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బల్యాల సుదర్శన్, కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు బీంరెడ్డి, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీరాం వెంకటేశ్‌తో పాటు పలువురు అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
మాజీ జెడ్పీటీసీ గ్యార లక్ష్మి కుటుంబ సభ్యులకు..
మాచారెడ్డి: మాచారెడ్డి మాజీ జెడ్పీటీసీ గ్యార లక్ష్మి కుటుంబ సభ్యులను మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబొద్దీన్ పరామర్శించారు. ఆమె ఇటీవల బ్రెయిన్ డెడ్‌కు గురికాగా.. కుటుంబ సభ్యులు అవయవాలను దానం చేసిన విషయం తెలిసిందే. మాజీ ఎమ్మెల్యే శుక్రవారం ఆమె కుటుంబాన్ని ఓదార్చారు. అనంతరం అక్కాపూర్ వెళ్లి మాజీ ఉప సర్పంచ్ ఎల్లయ్యను పరామర్శించారు. ఎల్లయ్య తల్లి మరణానికి కారణాలను తెలుసుకుని ఓదార్చారు. బీఆర్‌ఎస్ నాయకులు మినుకూరి రాంరెడ్డి, గోవిందరెడ్డి, రాజాగౌడ్, శ్రీకాంత్‌రెడ్డి ఉన్నారు.


