కుదిరిన అంగీకారం.. పెరిగిన కూలి | - | Sakshi
Sakshi News home page

కుదిరిన అంగీకారం.. పెరిగిన కూలి

Feb 19 2026 9:43 AM | Updated on Feb 19 2026 9:43 AM

కుదిర

కుదిరిన అంగీకారం.. పెరిగిన కూలి

కుదిరిన అంగీకారం.. పెరిగిన కూలి వర్సిటీలో అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి సెల్‌ టవర్‌ ఎక్కిన యువకుడు ఇరువర్గాలపై కేసు నమోదు

సుభాష్‌నగర్‌: నగరంలోని శ్రద్ధానంద్‌ గంజ్‌లో హోల్‌సేల్‌ కూరగాయల మార్కెట్‌లో కూలి రేట్లపై యజమానులు, హమాలీ కార్మికుల సంఘాల ప్రతినిధులతో బుధవారం జరిపిన చర్చల్లో అంగీకారం కుదిరినట్లు ఐఎఫ్‌టీయూ నగర కార్యదర్శి ఎం శివకుమార్‌ తెలిపారు. అంగీకారం మేరకు ఒక బాక్సుకు రూ.7, సంచికి రూ.10కి పెరిగిందని పేర్కొన్నారు. అలాగే 10 కిలోల క్యారీ బ్యాగు రూ.6కు పెంచారన్నారు. పెరిగిన కూలి ధరలు మార్చి 1, 2026 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు. సమావేశంలో ఐఎఫ్‌టీయూ అనుబంధ కూరగాయల నైట్‌ హమాలీ వర్కర్స్‌ యూనియన్‌ అధక్షుడు మేసినేని రాజు, కార్యదర్శి మతిన్‌ రసూల్‌, అన్వర్‌, వసీమ్‌, రాజు, సలీమ్‌ తదితరులు పాల్గొన్నారు.

తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ ప్రధాన క్యాంపస్‌ ఆవరణలో భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని వర్సిటీ విద్యార్థులు డిమాండ్‌ చేశారు. విగ్రహ ఏర్పాటుకు బట్టు శ్రీధర్‌ ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. అనంతరం కమిటీ ఆధ్వర్యంలో వీసీ టీ యాదగిరిరావును కలిసి వినతిపత్రం అందజేశారు. కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ.. యూనివర్సిటీ ఆవరణలో అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా ఉంటుందన్నారు. అంబేడ్కర్‌ విగ్రహ ఏర్పాటు కమిటీని ఎన్నుకున్నారు. కమిటీ కన్వీనర్‌గా అశ్విత్‌, కో కన్వీనర్లుగా వినీత్‌, నాగేంద్ర, సాయి ప్రకాశ్‌, గోపీచంద్‌, చక్రి, శ్రీనివాస్‌, వంశీ, కవిత, జ్యోతి, బాలమణి, సభ్యులుగా అనిల్‌, శ్రీనివాస్‌, నిరంజన్‌, ఆదిత్య, పవన్‌, కుశాల్‌, వంశీ, చరణ్‌, నాగేశ్‌, నవదీప్‌, కొండల్‌ ఎన్నికయ్యారు. కార్యక్రమంలో పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.

నవీపేట: తాగిన మైకంలో ఓ యువకుడు సెల్‌టవర్‌ ఎక్కి హంగామా సృష్టించిన ఘటన నవీ పేట మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్సై శ్రీకాంత్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలో ని సుభాష్‌నగర్‌ కాలనీకి చెందిన పులింటి వెంకట్‌ భార్య యేడాది క్రిదం కుటుంబ కలహాలతో పుట్టింటికి వెళ్లింది. తీవ్ర మనస్థాపానికి గురైన వెంకట్‌ తాగుడుకు బానిసై మతిస్థిమితం కోల్పోయాడు. తాగిన మైకంలో సెల్‌ టవర్‌ ఎక్కి హంగామా సృష్టించాడు. పోలీసులు అక్కడికి చేరుకుని వెంకట్‌ను కిందకి దింపారు.

మాక్లూర్‌: రోడ్డుపై ఘర్షణపడి ప్రజలను ఇబ్బందులకు గురిచేసిన ఇరువర్గాలపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజశేఖర్‌ బుధవారం తెలిపారు. మండలంలోని చిక్లి గ్రామంలో మంగళవారం రాత్రి ఓ వర్గానికి చెందిన వ్యక్తులు రెండు వర్గాలుగా విడిపోయి రోడ్డుపై ఘర్షణకు దిగారు. వారు కొందరు గ్రామస్తులపై సైతం దాడికి పాల్పడి భయాందోళనకు గురిచేశారు. దాడిలో గాయపడ్డ బాధితుడి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి ఇరువర్గాలపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

‘పీఎంశ్రీ నిధులు

23 లోపు ఖర్చు చేయాలి’

కామారెడ్డి టౌన్‌: పీఎంశ్రీ పాఠశాలలకు కేటాయించిన నిధులను ఈ నెల 23లోపు పూ ర్తిగా ఖర్చు చే యాలని విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ యోగితా రాణా ఆదేశించారు. బుధవారం సాయంత్రం వి ద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ నికోలస్‌తో కలిసి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, విద్యాశాఖ అధికారు లు, ఇంజినీరింగ్‌ అధికారులతో ఆమె వీడియో కా న్ఫరెన్స్‌ నిర్వహించారు. కామారెడ్డి కలెక్టరేట్‌ నుంచి కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌, అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగితా రాణా మాట్లాడుతూ.. పీఎంశ్రీ పాఠశాలల్లో చేపట్టిన అన్ని రకాల సివిల్‌ పనులు, ఇతర కార్యక్రమాలకు సంబంధించి నిబంధనల ప్రకారం నిధులను వినియో గించాలని సూచించారు. అధికారులు పాల్గొన్నారు.

కుదిరిన అంగీకారం..  పెరిగిన కూలి
1
1/1

కుదిరిన అంగీకారం.. పెరిగిన కూలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement