అభివృద్ధి కోసమే పొత్తులు | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి కోసమే పొత్తులు

Feb 17 2026 7:25 AM | Updated on Feb 17 2026 7:25 AM

అభివృద్ధి కోసమే పొత్తులు

అభివృద్ధి కోసమే పొత్తులు

పొత్తులు లేకుండానే ప్రధానమంత్రి

కుర్చీలో కుర్చున్నాడా?

ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి

సుభాష్‌నగర్‌: రాష్ట్రంలో మున్సిపాలిటీల అభివృద్ధి కోసమే ఇతర పార్టీలు కాంగ్రెస్‌తో పొత్తులకు ముందుకొస్తున్నాయని బోధన్‌ ఎమ్మెల్యే, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం నగరంలోని తన నివాసంలో ఆదిలాబాద్‌ మున్సిపల్‌ చైర్మన్‌గా ఎన్నికై న బండారి అనూష సతీశ్‌, కౌన్సిలర్లు సుదర్శన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిని ఘనంగా సన్మానించారు. పొత్తులపై ప్రధానికి ఒక రూల్‌.. కాంగ్రెస్‌ పార్టీకి ఒక రూల్‌ ఉండదని, టీడీపీ, ఇతర రాష్ట్రాల్లోని పార్టీలతో పొత్తులు పెట్టు కుని ప్రధాని మోదీ కుర్చీలో కూర్చున్నాడని, బీజేపీ నాయకులు అనైతిక పొత్తులని పేర్కొనడంపై సుద ర్శన్‌రెడ్డి తనదైన శైలిలో చురకలంటించారు. ఈ సందర్భంగా సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ ఆదిలాబాద్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా విద్యావంతురాలిని ఎన్నుకున్నారని తెలిపారు. సీఎం ఇటీవల నిర్మల్‌ సభలో ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తామన్నారు. పరిశ్రమలు ఏర్పాటు చేస్తే యువతకు ఉ ద్యోగాలు వస్తాయని పేర్కొన్నారు. పరిశ్రమల ఏ ర్పాటుకు 10 వేల ఎకరాలు అవసరమని, ఆ బాధ్య తను మంత్రి జూపల్లి కృష్ణారావు, తనకు సీఎం అప్పగించారని గుర్తుచేశారు. చైర్మన్లు, మేయర్లుగా మహిళలు, బీసీలకు కాంగ్రెస్‌ అవకాశమిచ్చిందని తెలిపారు. నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, నిర్మల్‌ జి ల్లాల్లో అత్యధిక మున్సిపాలిటీలు కాంగ్రెస్‌ కై వసం అయ్యాయన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు నరేశ్‌ జాదవ్‌, ఆదిలాబాద్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి కంది శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు శ్రీకాంత్‌రెడ్డి, సుజా త, సాజిద్‌ ఖాన్‌, అనిల్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement