రాష్ట్రస్థాయి క్రీడల్లో జిల్లా విద్యార్థుల ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి క్రీడల్లో జిల్లా విద్యార్థుల ప్రతిభ

Feb 20 2026 6:31 AM | Updated on Feb 20 2026 6:31 AM

రాష్ట్రస్థాయి క్రీడల్లో జిల్లా విద్యార్థుల ప్రతిభ

రాష్ట్రస్థాయి క్రీడల్లో జిల్లా విద్యార్థుల ప్రతిభ

చిన్నారులను అభినందించిన కలెక్టర్‌

నిజామాబాద్‌ అర్బన్‌: పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థుల క్రీడా పోటీల్లో నిజామాబాద్‌ జిల్లాలోని భవిత కేంద్రాలకు చెందిన చిన్నారులు ప్రతిభ చాటారు. చిన్నారులు గురువారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ ఇలా త్రిపాఠిని ఆమె ఛాంబర్‌లో మర్యాద పూర్వకంగా కలిశా రు. రాష్ట్ర స్థాయి పోటీల్లో సాధించిన మెడల్స్‌, బ హుమతులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ చిన్నారులను పేరుపేరున అభినందిస్తూ, వారి తో ఫొటో సెషన్‌లో పాల్గొన్నారు. భవిత కేంద్రాల విద్యార్థులను రాష్ట్ర స్థాయి పోటీలకు తీర్చిదిద్దిన ఐఆర్‌పీలు, ఇతర అధికారులను అభినందించారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల కోసం ఉద్దేశించి న భవిత కేంద్రాలను పూర్తి స్థాయిలో సద్వినియో గం చేసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు. సాధారణ విద్యార్థులకు సమానంగా భవిత కేంద్రా ల్లో ప్రతి విద్యార్థికి సమాన అవకాశాలు అందుతాయన్నారు. డీఈవో అశోక్‌, అధికారులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement