హిందూ సమాజాన్ని జాగృతం చేయాలి
● ప్రతిష్టిత వ్యక్తుల పాత్ర కీలకం
● ఆర్‌ఎస్‌ఎస్ అఖిల భారతీయ
ధర్మజాగరణ సహ సంయోజక్
ఏలే శ్యామ్‌కుమార్
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: హిందూ సమాజాన్ని జాగృతం చేయడంలో ప్రతిష్టిత వ్యక్తుల పాత్ర అత్యంత కీలకమైనదని ఆర్‌ఎస్‌ఎస్ అఖి ల భారతీయ ధర్మజాగరణ సహ సంయోజక్ ఏలే శ్యావ్‌ుకుమార్ అన్నారు. నగరంలోని శ్రీరా మ గార్డెన్స్‌లో బుధవారం ఆర్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో ప్రతిష్టిత వ్యక్తుల సమావేశం నిర్వహించారు. ప్రధాన వక్తగా హాజరైన శ్యామ్‌కుమార్ మాట్లాడుతూ భారతదేశం అన్నిరంగాల్లో ఎదుగుతుంటే ఓర్వలేని విదేశాల కుట్రల్లో భాగంగా కొన్ని సంస్థలు, దేశ విచ్ఛిన్నకర శక్తులు ఏకమై హిందూ సమాజాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కుట్రలకు పాల్పడుతున్నాయని అన్నారు. కుట్రలు, కుయుక్తులను సమర్థంగా తిప్పికొట్టేందుకు హిందూ సమాజం సమష్టిగా ముందుకు వెళ్లాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. అందుకు కావాల్సిన ఐకమత్యాన్ని నిర్మాణం చేయడం కోసమే ఆర్‌ఎస్‌ఎస్ కృషి చేస్తోందన్నారు. భాష, ప్రాంతం, సరిహద్దు, కులాల పేరుతో హిందూ సమాజాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని పేర్కొన్నారు. ఆ మాయల్లో పడి హిందువులు తమ స్వధర్మాన్ని మర్చిపోయి విదేశీ కుట్రలకు బలవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ స్థితి నుంచి హిందూ సమాజాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. సమాజంలోని అన్ని రంగాల్లో ఉన్న ప్రముఖులంతా తమ రంగాల్లోని ప్రజలకు వాస్తవాలను వివరించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ తన అస్తిత్వం కోసం ఏనాడూ పనిచేయలేదన్నారు. దేశభక్తి, హిందూ సమాజ సంఘటన ప్రాధాన్య తను వివరించడం ప్రస్తుత తక్షణ కర్తవ్యమ న్నారు. కేవలం హిందూ సమాజం కోసం, భారతదేశ కోసం మాత్రమే 100 సంవత్సరాల ప్రయాణాన్ని కొనసాగించిందన్నారు. రానున్న కాలంలోనూ దేశం కోసమే పనిచేస్తుందని శ్యామ్‌కుమార్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఇందూరు విభాగ్ సహ సంఘచాలక్ పాలేటి వెంకట్రావు, జిల్లా సంఘచాలక్ డాక్టర్ కాపర్తి గురుచరణం, విభాగ్ ప్రచారక్ నర్రా వెంకట శివకుమార్, నగర కార్యవాహ అరుగుల సత్యం, జిల్లా, నగరంలోని ప్రముఖులు పాల్గొన్నారు.
హిందూ సమాజాన్ని జాగృతం చేయాలి


