సీసీ కెమెరాలతో గ్రామ భద్రత బలోపేతం
పెద్దకొడప్‌గల్): గ్రామ భద్రతా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా సీసీ కెమెరాలు ఉపయోగపడుతాయని ఎంపీడీవో అభినవ్ చందర్ పేర్కొన్నారు. కాస్లాబాద్‌లో గ్రామ పంచాయతీ నిధులతో ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎంపీడీవో అభినవ్ చందర్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ చైతన్ యాదవ్ మాట్లాడుతూ.. సీసీ కెమెరాలతో నేరాలను నిరోధించడంతో పాటు ప్రజల్లో భద్రతాభావం పెరుగుతుందని అన్నారు. గ్రామంలో 8 చోట్ల సీసీ కెమెరాలు అమర్చినట్లు తెలిపారు. పంచాయతీ కార్యదర్శి శివాజీ, ఉప సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.
లింగంపేట(ఎల్లారెడ్డి): శెట్పల్లిసంగారెడ్డిలో బుధవా రం ఉపాధి హామీ పనులను సర్పంచ్ కత్తుల లక్ష్మి ప్రారంభించినట్లు తెలిపారు. గ్రామంలోని కూలీల కు ఉపాధి అవకాశాలు కల్పించడానికి పనులు చేపట్టినట్లు ఆమె పేర్కొన్నారు. కూలీలు అధిక సంఖ్యలో పాల్గొనేలా చూడాలని కార్యదర్శి, క్షేత్రసహాయకులకు సూచించారు. కుంటలో పూడికతీత ప నులు వేగవంతం చేయాలని సూచించారు.


