ఓటేద్దాం రండి
– IIలో u
నిజామాబాద్ అర్బన్/సుభాష్‌నగర్: మున్సిపల్ ఎన్నికల్లో కీలక ఘట్టమైన ఓట్ల పండుగకు సమ యం ఆసన్నమైంది. బుధవారం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆధ్వర్యంలో అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఓటరు స్లిప్పుల పంపిణీ దాదాపుగా పూర్తయ్యింది. నిజామాబాద్ నగరంతోపాటు బోధన్, ఆర్మూర్, భీమ్‌గల్ పట్టణాల్లో ఏర్పాటు చేసి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి ఎన్నికల సిబ్బంది పోలింగ్ సామగ్రితో తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. పోలింగ్ కేంద్రాల్లో ఇప్పటికే ర్యాంప్, టాయిలెట్స్, విద్యుత్ సరఫరా, నీటి వసతి, వీల్‌చైర్స్ తదితర సదుపాయాలు ఏర్పాటుచేశారు. పోలింగ్ కేంద్రాలను వెబ్‌క్యాస్టింగ్ ద్వారా కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేశారు. మైక్రో అబ్జర్వర్లు, జోనల్ అధికారులు నిశితంగా పరిశీలించనున్నారు.
బూత్‌కు రప్పిద్దాం..
ఇందూరు బల్దియాలో పోలింగ్ శాతం పెంచేందుకు అభ్యర్థుల పాట్లు
జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసినా అభ్యర్థులదే కీలక పాత్ర
ఓటేద్దాం రండి


