సమ్మెను విజయవంతం చేయండి
నిజామాబాద్ రూరల్: దేశవ్యాప్తంగా నేడు జరుగనున్న సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్–రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు రామ్మోహన్‌రావు అన్నారు. నాందేవ్‌వాడలోని పెన్షనర్స్ భవనంలో బుధవారం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పెన్షనర్లు ఎదుర్కొంటున్న పలు సమస్యలను కేంద్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈమేరకు రిటైర్డ్ ఉద్యోగులందరూ పాత కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చౌక్‌లో నేడు ఉదయం 10 గంటలకు హాజరుకావాలని కోరారు. జిల్లా ప్రతినిధులు శిర్ప హనుమాండ్లు, ఈవీఎల్ నారాయణ, రాధా కిషన్, సాంబశివరావు, ప్రసాద్‌రావు పాల్గొన్నారు.


