ఓటింగ్‌ తీరు.. పోలింగ్‌ ఏర్పాట్ల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

ఓటింగ్‌ తీరు.. పోలింగ్‌ ఏర్పాట్ల పరిశీలన

Feb 12 2026 11:27 AM | Updated on Feb 12 2026 11:27 AM

ఓటింగ

ఓటింగ్‌ తీరు.. పోలింగ్‌ ఏర్పాట్ల పరిశీలన

నిజామాబాద్‌ అర్బన్‌: మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్‌ ప్రక్రియ, పోలింగ్‌ ఏర్పాట్లను జిల్లా ఎ న్నికల అధికారి, కలెక్టర్‌ ఇలా త్రిపాఠి పరిశీలించా రు. నిజామాబాద్‌ నగరంలోని ఎస్‌ఎఫ్‌ఎస్‌ స్కూల్‌, అర్సపల్లి పాఠశాల, మాలపల్లిలోని బాలికల జూనియర్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాలతోపాటు ఆర్మూర్‌ పట్టణంలోని రాం మందిర్‌ ప్రభు త్వ ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్‌ హైస్కూల్‌, పెర్కిట్‌లోని జిల్లా పరిషత్‌ బాలుర ఉర్దూ మీడియం ఉన్నత పాఠశాల పోలింగ్‌ కేంద్రాలను సందర్శించారు. హెల్ప్‌ డెస్క్‌లు, మెడికల్‌ క్యాంపు, వీల్‌ చైర్‌ ఇతర అన్ని సదుపాయాలు అందుబాటులో ఉన్నా యా? అని తనిఖీ చేశారు. కలెక్టరేట్‌ నుంచి వెబ్‌ క్యాస్టింగ్‌ ద్వారా ఓటింగ్‌ తీరును, స్థానిక పరిస్థితులను కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌ కిరణ్‌కుమార్‌, అబ్జర్వర్‌ సీహెచ్‌ సత్యనారాయణరెడ్డి ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఓటింగ్‌ ప్రక్రియ సజావుగా కొ నసాగిందని, ఓటర్లు ప్రశాంత వాతావరణంలో స్వే చ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నా రని కలెక్టర్‌ అన్నారు. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రా ల వద్ద అదనపు పోలీసు బలగాలతో బందోబస్తు ఏ ర్పాటు చేయించామన్నారు. ఈ నెల 13న ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని తెలిపారు. అదనపు కలెక్టర్‌ కిరణ్‌కుమార్‌, ఎన్నికల సాధారణ పరిశీలకులు సీహెచ్‌ సత్యనారాయణరెడ్డి పలు పోలింగ్‌ కేంద్రాల్లో ఓటింగ్‌ తీరును పరిశీలించారు. పోలింగ్‌ ముగిసిన అనంతరం బ్యాలెట్‌ బాక్సులకు సీల్‌ వేసి, పోలీసు బందోబస్తు మధ్య స్ట్రాంగ్‌రూమ్‌లకు తరలించారు.

కలెక్టరేట్‌ నుంచి వెబ్‌క్యాస్టింగ్‌ ద్వారా పోలింగ్‌ సరళిని పరిశీలిస్తున్న కలెక్టర్‌

ఆర్మూర్‌లో పోలింగ్‌ కేంద్రాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌ ఇలా త్రిపాఠి

ఓటింగ్‌ తీరు.. పోలింగ్‌ ఏర్పాట్ల పరిశీలన 1
1/1

ఓటింగ్‌ తీరు.. పోలింగ్‌ ఏర్పాట్ల పరిశీలన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement