విద్యార్థులకు సైకిళ్ల అందజేత | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు సైకిళ్ల అందజేత

Feb 15 2026 12:33 PM | Updated on Feb 15 2026 12:33 PM

విద్య

విద్యార్థులకు సైకిళ్ల అందజేత

విద్యార్థులకు సైకిళ్ల అందజేత 28న విద్యార్థులకు వ్యాసరచన పోటీలు సేవాలాల్‌ జయంతిని అధికారికంగా నిర్వహించాలి

మాక్లూర్‌: మండలంలోని మాణిక్‌బండార్‌ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు శనివారం బెస్ట్‌ రన్నర్‌ ఆర్గనైజేషన్‌ సంస్థ సభ్యులు డీఈవో అశోక్‌ ఆధ్వర్యంలో రూ. లక్షా 20 వేలు విలువ చేసే సైకిళ్లను అందజేశారు. ఈ సందర్భంగా డీఈవో అశోక్‌ మాట్లాడుతూ పేద విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని స్వచ్ఛంద సంస్థ ముందుకు వచ్చి ఉచితంగా సైకిళ్లను అందించటం అభినందనీయమన్నారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ఎంఈవో సత్యనారాయణ, సంస్థ సభ్యులు దొడ్లె శేఖర్‌, సతీశ్‌, శ్రీనివాస్‌, గౌతమి, చిరంజీవి, కిశోర్‌, రజిని, గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు.

సుభాష్‌నగర్‌: జాతీయ సైన్స్‌ దినోత్సవం సందర్భంగా ఈ నెల 28న విద్యార్థులకు వ్యాసరచ న, డ్రాయింగ్‌తోపాటు ఇతర పోటీలు నిర్వహించనున్నట్లు జేవీవీ నాయకులు కోయేడి నర్సింహులు,గుర్రం వెంకటమల్లయ్య శనివా రం ఒక ప్రకటనలో తెలిపారు.నగరంలోని నాందేవ్‌వాడలో ఉన్న మల్లు స్వరాజ్యం కార్యా లయంలో ఆదివారం సాయంత్రం కార్యక్రమ నిర్వహణ,ఏర్పాట్ల గురించి సమావేశం నిర్వ హిస్తున్నామన్నారు.ప్రతినిధులు సకాలంలో హాజరై విజయవంతం చేయాలనివారు కోరారు.

మోపాల్‌: సంత్‌ సేవాలాల్‌ మహరాజ్‌ జయంతిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించి, సెలవుదినంగా ప్రకటించాలని ఏఐబీఎస్‌ఎస్‌ మండల అధ్యక్షుడు ఎల్‌ బాలు నాయక్‌ డిమాండ్‌ చేశారు. శనివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బంజారా బిడ్డల ను భక్తి మార్గంలో నడిపించారని, చెడు అలవాట్లకు దూరంగా ఉండేలా కృషి చేశారని కొని యాడారు. పార్లమెంట్‌లో సేవాలాల్‌ మహరా జ్‌ గురించి మాట్లాడిన ఎంపీ అర్వింద్‌ ధర్మపురికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ నెల 15న నిర్వహించే సేవాలాల్‌ మహరాజ్‌ జయంతిని పురస్కరించుకొని పాఠశాలలు, కళాశాలలకు అధికారికంగా సెలవుదినంగా ప్రకటించా లని కోరారు. మండల ప్రధానకార్యదర్శి జలంధర్‌, జిల్లా గౌరవాధ్యక్షుడు నరేశ్‌, నాయకులు ఇందల్‌, ఓం సింగ్‌, జోర్‌సింగ్‌ పాల్గొన్నారు.

విద్యార్థులకు సైకిళ్ల అందజేత 1
1/1

విద్యార్థులకు సైకిళ్ల అందజేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement