ఛత్రపతి శివాజీ యువతకు ఆదర్శం
నిజామాబాద్ రూరల్: ఛత్రపతి శివాజీ జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని యువత ముందుకు సాగాలని ఆర్‌ఎస్‌ఎస్ విభాగ్ ప్రచారక్ శివకుమార్ జీ అన్నారు. శివాజీ జయంతి సందర్భంగా హిందూ సంఘాల సభ్యులు చేపట్టిన ర్యాలీ నగరంలోని బోర్గాం(పీ) వద్ద నుంచి పులాంగ్, నాందేవ్‌వాడ, కెనాల్‌కట్ట మీదుగా దుబ్బలో ఉన్న మైసమ్మ ఆలయం వరకు కొనసాగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పోలీసులు బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు, భజరంగ్‌దళ్, హిందూ వాహిణితో పాటు హిందూ సంఘాల నాయకులు, వీహెచ్‌పీ తెలంగాణ విభాగ్ కృషి ప్రముఖ్ ధాత్రిక రమేశ్, ప్రజలు పాల్గొన్నారు.
ఆర్‌ఎస్‌ఎస్ విభాగ్ ప్రచారక్
శివకుమార్
ఇందూరులో
ఘనంగా శివాజీ జయంతి
ఛత్రపతి శివాజీ యువతకు ఆదర్శం
ఛత్రపతి శివాజీ యువతకు ఆదర్శం
ఛత్రపతి శివాజీ యువతకు ఆదర్శం


