క్రీడల్లో గెలుపోటములు సహజం | - | Sakshi
Sakshi News home page

క్రీడల్లో గెలుపోటములు సహజం

Feb 13 2026 5:23 AM | Updated on Feb 13 2026 5:23 AM

క్రీడల్లో గెలుపోటములు సహజం

క్రీడల్లో గెలుపోటములు సహజం

ఆర్మూర్‌టౌన్‌: క్రీడల్లో గెలుపోటములు సహజమని వాటిని సమానంగా తీసుకోవాలని ఆర్మూర్‌ బాలుర పాఠశాల హెచ్‌ఎం లక్ష్మీనర్సయ్య అన్నారు. ఆర్మూర్‌ పట్టణంలోని జడ్పీహెచ్‌ఎస్‌ బాలుర పాఠశాలలో గురువారం జిల్లా స్థాయి సీఎం కప్‌ సాఫ్ట్‌ బాల్‌ టోర్నోమెంట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర క్రీడాకారులను ఒలంపిక్స్‌ స్థాయిలో రాణించే విధంగా ప్రభుత్వం చేపట్టాలన్నారు. అనంతరం జిల్లా క్రీడాధికారి పవన్‌కుమార్‌ మాట్లాడుతూ.. జిల్లా స్థాయి సీఎం కప్‌ సాఫ్ట్‌బాల్‌ టోర్నమెంట్‌కు 8 మహిళా విభాగం జట్లు, 8 పురుషుల విభాగం జట్లు పాల్గొన్నాయన్నారు. పోటీల్లో పురుషుల విభాగాంలో ఆర్మూర్‌ ప్రథమ, తొర్లికొండ ద్వితీయ, కమ్మర్‌పల్లి జట్లు తృతీయ స్థానంలో నిలిచాయి. అలాగే మహిళా విభాగంలో సుద్ధపల్లి ప్రథమ, ఆర్మూర్‌ ద్వితీయ, ముచ్కూర్‌ జట్లు తృతీయ స్థానాల్లో నిలిచాయి. కార్యక్రమంలో జిల్లా సాఫ్ట్‌ బాల్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి గంగామోహన్‌, సంయుక్త కార్యదర్శి సుజాత, జిల్లా బేస్‌బాల్‌ అసోసియేషన్‌ ప్రధానకార్యదర్శి వినోద్‌, ఉపాధ్యాయులు, స్వప్న, అనికెత్‌, రాహుల్‌, సీనియర్‌ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement