క్రైం కార్నర్‌ | - | Sakshi
Sakshi News home page

క్రైం కార్నర్‌

Feb 15 2026 12:33 PM | Updated on Feb 15 2026 12:33 PM

క్రైం కార్నర్‌

క్రైం కార్నర్‌

వివాహిత ఆత్మహత్య అన్నను చంపిన తమ్ముడు

డొంకేశ్వర్‌(ఆర్మూర్‌): మండల కేంద్రంలో రేఖాదేవి (32) అనే వివాహిత ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై శ్యామ్‌రాజ్‌ తెలిపారు. మృతిరాలి తండ్రి మీసాలి గంగాధర్‌ ఫిర్యాదు మేరకు ఎస్సై తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మహారాష్ట్రకు చెందిన రేఖాదేవికి 13 ఏళ్ల క్రితం దేవిదాస్‌తో వివాహం జరుగగా వీరికి ఇద్దరు పిల్లలున్నారు. శుక్రవారం మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చిన భర్త దేవిదాస్‌ తన భార్య గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో చనువుగా ఉండటంతో అనుమానించి నిలదీశాడు. ఈ క్రమంలో జరిగిన గొడవతో మనస్తాపం చెందిన రేఖాదేవి గదిలోకి వెళ్లి టవల్‌తో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. స్థానికులు తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లేసరికి ఆమె అప్పటికే ప్రాణాలు విడిచింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటాని ఎస్సై పేర్కొన్నారు.

వర్ని: కుటుంబ కలహాలతో సొంత అన్నను తమ్ముడు హత్య చేసిన ఘటన వర్ని మండలం వడ్డేపల్లి గ్రామంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వడ్డేపల్లికి చెందిన ఎత్తరి సాయిబాబా, రాంబాబు అన్నదమ్ములు. కొన్ని రోజుల క్రితం వీరి తల్లి అనారోగ్యంతో మృతి చెందింది. అయితే, తల్లి మృతికి అన్న సాయిబాబే కారణమని రాంబాబు భావించినట్లు స్థానికులు తెలిపారు. శనివారం రాత్రి కర్రతో సాయిబాబా(32) తలపై కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం తన అన్న సాయిబాబాను హత్య చేసినట్లు డయల్‌ 100కు ఫోన్‌ చేసి పోలీసులకు లొంగిపోయినట్లు తెలిసింది. వర్ని పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement