శ్రీరస్తు.. శుభమస్తు..
● నేటి నుంచి శుభ ముహూర్తాలు
● మోగనున్న భాజాభజంత్రీలు
నిజామాబాద్ రూరల్: శుభ ఘడియలు వచ్చేశాయి. నేటి నుంచి వివాహాలు, గృహ ప్రవేశాలు, ఇతర శుభకార్యాలకు మంచి రోజులున్నాయి. గతేడాది నవంబర్ 26 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 17 వరకు శుక్ర మౌఢ్యమి నేపథ్యంలో శుభకార్యాలు లేకుండా పోయాయి. ఈ నెల 19 నుంచి పెళ్లి ముహూర్తాలు ఉండటంతో భాజాభజంత్రీలు మోగనున్నాయి. వచ్చే డిసెంబర్ వరకు అక్టోబర్ మినహా మిగతా అన్ని నెలల్లో సుముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. పెద్ద ఎత్తున పెళ్లిళ్లు జరగనుండటంతో బట్టలు, బంగారం దుకాణాలు, ఫంక్షన్ హాళ్లు కళకళలాడనున్నాయి. భాజాభజంత్రీలు, డీజేలు, డెకరేషన్, క్యాటరింగ్, లగ్నపత్రికల ప్రింటింగ్ ప్రెస్‌లకు ఆర్డర్లు వచ్చే అవకాశం ఉంది.
సుముహూర్తాలు
ఫిబ్రవరి 20, 21, 22, 25
మార్చి 5 , 6, 7, 8, 11, 12,
ఏప్రిల్ 1, 2, 3, 4, 8, 10, 11, 12, 29, 30
మే 1, 3, 6, 8, 9, 10
జూన్ 20, 24, 25
జూలై 1, 2, 3, 8
ఆగస్టు 16, 20, 21, 23, 26, 27, 30
సెప్టెంబర్ 4, 6, 7
నవంబర్ 13, 14, 15, 18, 20, 21, 22, 26
డిసెంబర్ 3, 12, 13, 18, 19, 20, 31
అన్నీ మంచి రోజులే
నేటి నుంచి వివాహాలకు మంచి ముహూర్తాలున్నా యి. గృహప్రవేశాలు, వివా హాలు, నూతన కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. జిల్లాలో పెద్ద ఎత్తున శుభకా ర్యాలు జరుగుతాయి.
– సాయి రాఘవాచార్యులు, పండితులు
శ్రీరస్తు.. శుభమస్తు..


