తీవ్ర ఉత్కంఠ మధ్య వెలువడనున్న ఫలితాలు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నగరపాలక, పురపాలక ఎన్నికలకు సంబంధించి శుక్రవారం ఓట్ల లె క్కింపు చేసి ఫలితాలు విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ నగరం, బోధన్, ఆర్మూ ర్, భీమ్‌గల్ మున్సిపాలిటీల్లోని డివిజన్లు, వార్డులకు పోటీ చేసిన అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా అందరి దృష్టి ఉన్న నిజామాబాద్ నగర పాలకం ఫలితాలపై జిల్లాలోని అన్నివర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.
మేయర్ పీఠంపై కన్నేసిన ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లు జరిగిన ప్రతి అంశాన్ని పోస్టుమార్టం చేస్తూ సమీకరణాల లెక్కలు వేసుకుంటు న్నాయి. ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ను వ్వా నేనా అనేలా పోటీ నడిచింది. మధ్యలో ఎంఐ ఎం తన పట్టును నిలుపుకునేలా బరిలో కొట్లాడింది. దీంతో నిజామాబాద్ కార్పొరేషన్ ఫలితంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.
ఇందూరులో అతిపెద్ద పార్టీగా బీజేపీ నిలుస్తుందనే అంచనాలు ఉన్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం మద్దతు తీసుకుని మేయర్ పీఠం కై వసం చేసుకుంటుందనే అంచనాలు సైతం ఉన్నాయి. ఇంతటి పోటీ మధ్య బీఆర్‌ఎస్ 3 నుంచి 4 సీట్లు గెలిచినప్పటికీ కింగ్‌మేకర్ అయ్యే చాన్స్ ఉంటుందనే చర్చ నడుస్తోంది. ఇక స్వతంత్రులు ఒకటి రెండు గెలుచుకుంటే మాత్రం సమీకరణలు మరింత రసకందాయంలో పడినట్లే. ఎంఐఎంకు కింగ్‌మేకర్ అవకాశం వస్తే కాంగ్రెస్‌కు, బీఆర్‌ఎస్‌కు కింగ్‌మేకర్ అవకాశం వస్తే బీజేపీకి మద్దతు ఇస్తాయంటున్నారు. స్వతంత్రులు రెండుకు మించి గెలుచుకుంటే మాత్రం రాజకీయం భలేగా ఉంటుంది. పార్టీల నేతలు ఓ వైపు తామే గెలుస్తామని ఎవరి ధీమా వారే వ్యక్తం చేస్తున్నారు.
పాలిటెక్నిక్ కళాశాలలోని కౌంటింగ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన టేబుళ్లు
జిల్లాలోని మున్సిపాలిటీల్లో పోలింగ్ వివరాలు..
విజయావకాశాలపై లెక్కలు
వేసుకుంటున్న అభ్యర్థులు
మెజార్టీ స్థానాలపై ప్రధాన పార్టీల్లో ధీమా
పోలింగ్ శాతం తగ్గడంతో
మారనున్న అంచనాలు
అందరి దృష్టి ఇందూరు
కార్పొరేషన్ పైనే..
తీవ్ర ఉత్కంఠ మధ్య వెలువడనున్న ఫలితాలు


