సమన్వయ లోపం.. కౌంటింగ్ ఆలస్యం
నిజామాబాద్‌అర్బన్/సుభాష్‌నగర్: నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఆలస్యంగా ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా, 9.50 గంటలకు కౌంటింగ్ ప్రారంభించారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు తరువాత 10.30గంటలకు సిబ్బందికి అల్పాహారం ఏర్పాటుచేశారు. ఇదే సమయంలో మరో గంటలపాటు ఆలస్యమైంది. మధ్యాహ్నం 12.30 గంటలకు లెక్కింపు ప్రారంభం కావాల్సి ఉన్నా.. రిటర్నింగ్ అధికారులు, పోలింగ్ ఆఫీసర్ల మధ్య సమన్వ యం లోపించింది. అన్ని డివిజన్‌ల కౌంటింగ్ ఒకే సారి ప్రారంభించాలని రిటర్నింగ్ అధికారులు పే ర్కొనగా.. కొన్నిటేబుళ్ల వద్ద పోలింగ్ అధికారులు ఇందుకు ససేమిరా అన్నారు. ఈ క్రమంలో ఉన్నతాధికారుల ఆదేశాల కోసం మరో గంట వేచి చూశా రు. ఇదేసమయంలో కొన్ని డివిజన్ల లెక్కింపు ప్రా రంభమైంది. దీంతో కౌంటింగ్ ప్రక్రియ పూర్తిస్థాయిలో ప్రారంభం కావడానికి మధ్యాహ్నం 2 గంట లు దాటింది. 60 డివిజన్‌ల నాలుగు కౌంటింగ్ హాళ్లను ఏర్పాటుచేశారు. ఒక్కో డివిజన్‌కు ఒకటి చొప్పున 60 కౌంటింగ్ టేబుళ్లు ఏర్పాటుచేశారు. ఏక కాలంలో అన్ని డివిజన్లు ఒకేసారి లెక్కింపు ప్రారంభించాలని ముందస్తుగా నిర్ణయించుకున్నా.. అమలు చేయడంలో విఫలమయ్యారు. పోలైన ఓట్ల ను 25 చొప్పున బండిళ్లుగా విభజిస్తూ ఒక్కో రౌండ్ లో వెయ్యిచొప్పున ఓట్లను లెక్కించేలా నిర్ణయించారు. కానీ ఆలస్యం వల్ల సాధ్యం కాలేకపోయింది. ఒక్కో టేబుల్‌కు కౌంటింగ్ సూపర్‌వైజర్లు, ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లతోపాటు సపోర్టింగ్ స్టాఫ్‌ను నియమించారు. వీరి మధ్య సమన్వయం లోపించింది. దీంతో ఓట్ల లెక్కింప ప్రక్రియ గంటల తరబడి ఆలస్యమైంది. పూర్తిస్థాయి ఫలితాలు రాత్రి 10గంటల వరకు వచ్చాయి.
ఉదయం 9.50 గంటలకు
ప్రారంభమైన కౌంటింగ్
ఆ వెంటనే సిబ్బందికి అల్పాహారం
రిటర్నింగ్ అధికారులు, పోలింగ్ ఆఫీసర్ల మధ్య సమన్వయలోపం
రాత్రి వరకు కొనసాగిన
ఫలితాల ప్రక్రియ
సమన్వయ లోపం.. కౌంటింగ్ ఆలస్యం


