కలిసొచ్చిన అవకాశం | - | Sakshi
Sakshi News home page

కలిసొచ్చిన అవకాశం

Feb 17 2026 7:25 AM | Updated on Feb 17 2026 7:25 AM

కలిసొచ్చిన అవకాశం

కలిసొచ్చిన అవకాశం

ఆర్మూర్‌: రాజకీయ నేపథ్యం లేని, సాధారణ గృహిణి ఆర్మూర్‌ పట్టణ ప్రథమ పౌరురాలిగా ఎంపికయ్యింది. ఏ పార్టీలోనూ సాధారణ కార్యకర్తగా సభ్యత్వం లేని ఆమె జీవితం పక్షం రోజుల్లోనే మారిపోయింది. కుటుంబంతోపాటు భర్త చేసే మెడికల్‌ వ్యాపారంలో చేదోడు వాదోడుగా ఉండే గోనె లహరికి అనూహ్యంగా వచ్చిన ఈ పదవిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. రాజకీయ నేపథ్యంలేని కుటుంబం నుంచి వచ్చిన ఆమెకు రిజర్వేషన్‌ కలిసి రావడం, కుటుంబసభ్యుల ప్రోత్సాహంతో ఆర్మూర్‌ పట్టణంలోని 15వ వార్డు నుంచి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించింది. చైర్‌పర్సన్‌ రేసులో ఉన్న హేమాహేమీలు అనూహ్యంగా ఓటమి పాలవ్వడం గోనె లహరికి కలిసొచ్చింది. కౌన్సిలర్‌గా గెలిస్తే చాలు అంటూ ఎదురుచూసిన వీరికి ఎన్నికల ఫలితాలు వెలువడిన మూడు రోజుల్లో చైర్‌పర్సన్‌ పీఠం లభించడం సర్వత్రా సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తోంది.

ఆర్మూర్‌ పట్టణ ప్రథమ పౌరురాలిగా సాధారణ గృహిణి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement