మేయర్, చైర్మన్ ఎన్నికకు పకడ్బందీ ఏర్పాట్లు
సుభాష్‌నగర్ : నిజామాబాద్ నగర పాలక సంస్థ మేయర్‌తోపాటు బోధన్, ఆర్మూర్, భీంగల్ మున్సిపాలిటీల్లో చైర్మన్ ఎన్నిక, ప్రత్యేక సమావేశానికి పకడ్బందీ ఏర్పాట్లు పూర్తిచేశామని కలెక్టర్ ఇలా త్రిపా ఠి తెలిపారు. నిజామాబాద్ నగర పాలక సంస్థ కా ర్యాలయంలో సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదివారం కార్పొరేషన్‌ను సందర్శించి ఏర్పాట్లు పరిశీలించారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా పక్కాగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. నిజామాబాద్ నగర పాలక సంస్థతోపాటు బోధన్, ఆర్మూర్, భీమ్‌గల్ మున్సిపాలిటీల్లో కూడా లోటుపాట్లకు తావు లేకుండా స్పెషల్ మీటింగ్‌కు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. సోమవారం ఉదయం 11 గంటలకు ప్రత్యేక సమావేశం ప్రారంభమవుతుందని, నూతనంగా ఎన్నికై న కార్పొరేటర్లు, కౌన్సిలర్లతో స్పెషల్ ఆఫీసర్లు ప్రమాణ స్వీకారం చేయిస్తారని పేర్కొన్నారు. అనంతరం రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా మధ్యాహ్నం 12.30 గంటలకు మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక జరుగుతుందని తెలిపారు. కలెక్టర్ వెంట నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, ఆర్డీవో రాజేంద్రకుమార్ తదితరులు ఉన్నారు.
పటిష్ట బందోబస్తు..
మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక నేపథ్యంలో పటి ష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు సీపీ సాయి చై తన్య తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన కా ర్పొరేషన్‌లో ఏర్పాట్లను పరిశీలించారు. శాంతియు త వాతావరణంలో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు జరిగేలా అన్ని పార్టీల ప్రతినిధులు సహకరించాలని కోరారు.


