ఉన్నత విద్యకు పేదలు దూరం | - | Sakshi
Sakshi News home page

ఉన్నత విద్యకు పేదలు దూరం

Feb 21 2026 7:08 AM | Updated on Feb 21 2026 7:08 AM

ఉన్నత విద్యకు పేదలు దూరం

ఉన్నత విద్యకు పేదలు దూరం

ఏఐఎస్‌ఎఫ్‌ జాతీయ ప్రధాన

కార్యదర్శి దినేశ్‌ సిరంగరాజ్‌

ఖలీల్‌వాడి: కేంద్రం ప్రవేశపెట్టిన వికసిత్‌ భారత్‌ శిక్షా అధిష్టాన్‌(వీబీఎస్‌ఏ)బిల్లు–2025తో పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం కానున్నారని ఏఐఎస్‌ఎఫ్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి దినేశ్‌ రంగరాజన్‌ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పులాంగ్‌ సమీపంలో ఉన్న ఓ ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహిస్తున్న ఏఐఎస్‌ఎఫ్‌ నాలుగవ జాతీయ మహాసభలు మూడో రోజు కొనసాగాయి. కేంద్ర ప్రభుత్వం తన సొంత ఎజెండాను వర్సీటీలపై రుద్దేందుకు కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. వీబీఎస్‌ఏ బిల్లు, యూజీసీ నూతన మార్గదర్శకాలు, రాజ్యంగ సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని వెంటనే దీనిని ఉపసంహరించాలని డిమాండ్‌ చేశారు. దేశంలో 12 ఏళ్లు అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశ విద్యారంగాన్ని కార్పొరేట్‌, మతోన్మాద విధానాలు అమలు చేస్తూ ప్రభుత్వ విద్యారంగాన్ని కార్పొరేట్‌, ప్రైవేటు శక్తులకు అప్పజెప్పే కుట్రలు చేస్తుందని విమర్శించారు. బీజెపీ పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తోందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించకుండా కొత్త సమస్యలను సృష్టిస్తున్నారని ఏఐఎస్‌ఎఫ్‌ జాతీయ ఉపాధ్యక్షుడు ఎన్‌ ఏ స్టాలిన్‌ ఆరోపించారు. కార్యక్రమంలో ఆహ్వాన సంఘం గౌరవ అధ్యక్షుడు మారయ్య గౌడ్‌, ప్యాట్రన్‌ రజినీకాంత్‌, ఏఐఎస్‌ఎఫ్‌ జాతీయ మాజీ అధ్యక్షుడు తక్కలపల్లి శ్రీనివాసరావు, మాజీ రాష్ట్ర నాయకులు ఈటీ నర్సింహ, జాతీయ నాయకులు బందెల నాసర్‌ జీ, ఆహ్వాన సంఘం అధ్యక్షుడు పీ సుధాకర్‌, ఏఐటియూసీ రాష్ట్ర కార్యదర్శి వై ఓమయ్య, ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్‌, రాష్ట్ర ఆఫీస్‌ బేరర్స్‌ ఇటుకెల రామకష్ణ, రఘురాం, గ్యార నరేశ్‌ రహమాన్‌, నాగజ్యోతి, గ్యార క్రాంతి, లెనిన్‌, రాజు, ప్రవీణ్‌, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు సుబోధ్‌, జిల్లా సహాయ కార్యదర్శి కుశాల్‌, కార్తీక్‌, కోశాధికారి అనూష, నాయకులు హాసిని, కిశోర్‌, నిఖిల్‌, గౌతం, దిలీప్‌, ప్రవీణ్‌, సోను, రాజ్‌, ఆకాశ్‌, కృతిక్‌, విద్యార్థి ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement