నెలాఖరులోపు లక్ష్యాన్ని పూర్తిచేయాలి | - | Sakshi
Sakshi News home page

నెలాఖరులోపు లక్ష్యాన్ని పూర్తిచేయాలి

Feb 21 2026 8:02 AM | Updated on Feb 21 2026 8:02 AM

నెలాఖరులోపు లక్ష్యాన్ని పూర్తిచేయాలి

నెలాఖరులోపు లక్ష్యాన్ని పూర్తిచేయాలి

మార్కెటింగ్‌ శాఖ జేడీ మల్లేశం

సుభాష్‌నగర్‌: నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లాలోని మార్కెట్‌ కమిటీల్లో 2025–26 సంవత్సరం లక్ష్యా న్ని ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలని మార్కెటింగ్‌ శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ మల్లేశం ఆదేశించారు. నగరంలోని శ్రద్ధానంద్‌ గంజ్‌లో గల సమావేశ మందిరంలో ఉమ్మడి జిల్లాలోని 17 మార్కెట్‌ కమిటీల కార్యదర్శులతో ఆయన శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లేశం మా ట్లాడుతూ ఉమ్మడి జిల్లా మార్కెట్‌ ఫీజు వసూలు లక్ష్యం రూ.63.05 కోట్లు ఉండగా, ఇప్పటి వరకు రూ.41.30 కోట్లు వసూలైందని తెలిపారు. మిగిలిన లక్ష్యాన్ని వీలైనంత త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. ప్రతినెల 10వ తేదీ వరకే వ్యాపారుల నుంచి బకాయిలతో సహా మొత్తం ఫీజు వసూలు చేయాలని, రైస్‌మిల్లులు, ఇతర మిల్లుల ప్రాంగణాలను తని ఖీ చేయాలని ఆదేశించారు. సమావేశంలో డీఎంవో గంగు, సెలక్షన్‌ గ్రేడ్‌ సెక్రెటరీ అపర్ణ, ఉమ్మడి జిల్లా మార్కెట్‌ కమిటీల కార్యదర్శులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement