క్రైం కార్నర్‌ | - | Sakshi
Sakshi News home page

క్రైం కార్నర్‌

Feb 17 2026 7:25 AM | Updated on Feb 17 2026 7:25 AM

క్రైం కార్నర్‌

క్రైం కార్నర్‌

చోరీ కేసులో ఏడాది జైలు డ్రంకెన్‌డ్రైవ్‌ కేసులో రెండు రోజులు..

బోధన్‌టౌన్‌(బోధన్‌): బోధన్‌ పటణంలో జైళ్ల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పెట్రోల్‌ బంక్‌లో పనిచేస్తున్న ఖైదీకి ద్విచక్ర వాహన చోరీ కేసులో ఏడాది జైలు శిక్ష, రూ. 500 జరిమానా విధిస్తూ జ్యుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ న్యాయమూర్తి పూజిత సోమవారం తీర్పు వెలువరించినట్లు సీఐ వెంకట నారాయణ తెలిపారు. పట్టణ శివారులో జైళ్ల ఏర్పాటు చేసిన పెట్రోల్‌ బంక్‌లో ఖైదీగా ఉన్న కత్రోత్‌ జీవన్‌ విధులు నిర్వహిస్తున్నాడు. జూన్‌ 29 2025 న పెట్రోల్‌ బంక్‌లో నిలిపి ఉన్న టీఎస్‌11ఈడీ2415 నెంబర్‌ గల జైలు వాహనంతోపాటు రూ. 16 వేల నగదును చోరీ చేసి పరారయ్యాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో భాగంగా నిందితుడిని పట్టుకొని బోధన్‌ కోర్టులో ప్రవేశపెట్టారు. నిందితుడికి ఏడాది జైలుశిక్షతోపాటు రూ. 500 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు.

నిజాంసాగర్‌(జుక్కల్‌): మద్యం సేవించి వాహనం నడిపిన ఒకరికి సోమవారం బాన్సువాడ సెకండ్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ గోపాల్‌ రూ.వెయ్యి జరిమానాతోపాటు రెండు రోజుల జైలు శిక్ష విధించినట్లు ఎస్సై శివకుమార్‌ తెలిపారు. ఎల్లారెడ్డి మండలం కొక్కండకు చెందిన మైశయ్య మద్యం తాగి వాహనం నడపడటంతో కేసు నమోదు చేశామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement