దైవదర్శనానికి వచ్చి మృత్యుఒడికి | - | Sakshi
Sakshi News home page

దైవదర్శనానికి వచ్చి మృత్యుఒడికి

Feb 19 2026 9:43 AM | Updated on Feb 19 2026 9:43 AM

దైవదర

దైవదర్శనానికి వచ్చి మృత్యుఒడికి

చికిత్స పొందుతూ ఒకరి మృతి మద్నూర్‌లో బైక్‌ చోరీ

నవీపేట: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఓ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఎస్సై శ్రీకాంత్‌ బుధవారం తెలిపిన వివరాల ప్రకారం.. బోధన్‌ పట్టణంలోని కుమార్‌గల్లీకి చెందిన బోదు గణపతి(42) ఈ నెల 9న బోధన్‌ నుంచి బాసరకు బైక్‌పై వెళ్తుండగా ఫకీరాబాద్‌ సమీపంలో అదుపుతప్పి కిందపడ్డాడు. ప్రమాదంలో అతని తల, చేతలకు తీవ్రగాయాలు కావడంతో జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం అర్ధరాత్రి మృతి చెందాడు. మృతుడి భార్య సువర్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

మాచారెడ్డి : దైవ దర్శనానికి వచ్చిన భక్తుడు ఒకరు ప్రమాదవశాత్తు కోనేరు బావిలో పడి మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం చుక్కాపూర్‌ లక్ష్మినర్సింహస్వామి ఆలయ వద్ద మంగళవారం రాత్రి జరిగింది. ఎస్సై అనిల్‌ కథనం ప్రకారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన పందిర్ల సురేశ్‌గౌడ్‌ (45) తరచుగా లక్ష్మినర్సింహస్వామి ఆలయానికి వచ్చి వెళుతుంటాడని, అదే విధంగా మంగళవారం దైవదర్శనానికి వచ్చి కాళ్లు చేతులు కడుక్కునే క్రమంలో ప్రమాదవశాత్తు కోనేరులో పడి మృతి చెందినట్టు వివరించారు. ఈ మేరకు బుధవారం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్టు వివరించారు.

మద్నూర్‌(జుక్కల్‌): మండల కేంద్రంలోని టీచర్స్‌ కాలనీలో ఇంటి ఎదుట పార్క్‌ చేసిన ఓ బైక్‌ చోరీకి గురైంది. కాలనీకి చెందిన వడ్డె కాశీనాథ్‌ అనే వ్యక్తి తన బైక్‌ను మంగళవారం అర్ధరాత్రి ఎప్పటిలాగే ఇంటి ఎదుట పార్క్‌ చేసి నిద్రించాడు. బుధవారం ఉదయం బైక్‌ కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపాడు.

దైవదర్శనానికి వచ్చి మృత్యుఒడికి1
1/1

దైవదర్శనానికి వచ్చి మృత్యుఒడికి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement