వృద్ధుడికి సపర్యలు | - | Sakshi
Sakshi News home page

వృద్ధుడికి సపర్యలు

Feb 13 2026 5:23 AM | Updated on Feb 13 2026 5:23 AM

వృద్ధ

వృద్ధుడికి సపర్యలు

వృద్ధుడితో మాట్లాడుతున్న అడిషనల్‌ డీసీపీ బస్వారెడ్డి, సపర్యలు చేసిన స్వచ్ఛంద సంస్థ సభ్యులు

నిజామాబాద్‌ రూరల్‌: రోడ్డుపై నడవలేనిస్థితిలో పాకుతున్న ఓ అనాథ వృద్ధుడిని చూసి చలించి పోయిన అడిషనల్‌ డీసీపీ బస్వారెడ్డి వెంటనే ఓ స్వచ్ఛంద సంస్థతో సపర్యలు చేపట్టి వైద్యం అందించేలా కృషి చేశారు. గురువారం విధి నిర్వహణలో భాగంగా కంఠేశ్వర్‌ ప్రాంతం గుండా పోలీస్‌ వాహనంలో వెళ్తున్న అడిషనల్‌ డీసీపీ ఓ అనాథ వృద్ధుడు నడవలేని స్థితిలో, గాయాలతో రోడ్డుపై పాకుతుండటాన్ని గమనించి చలించిపోయారు. వెంటనే తన వాహనం దిగి వృద్ధుడి వద్దకు వెళ్లి మాట్లాడారు. ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులకు సమాచారం అందించాగా వారు అక్కడికి చేరుకొని వృద్ధుడికి సపర్యలు చేపట్టి చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఏసీపీ ప్రకాశ్‌, మూడో టౌన్‌ ఎస్సై హరిబాబు, స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు మద్దుకురి సాయిబాబు, వాల బాలకిషన్‌, దర్శనం రాజు, నయన్‌ పాల్గొన్నారు.

వృద్ధుడికి సపర్యలు1
1/1

వృద్ధుడికి సపర్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement