బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్‌ ఇంటి వద్ద హైడ్రామా | - | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్‌ ఇంటి వద్ద హైడ్రామా

Feb 14 2026 9:59 AM | Updated on Feb 14 2026 9:59 AM

బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్‌ ఇంటి వద్ద హైడ్రామా

బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్‌ ఇంటి వద్ద హైడ్రామా

భారీ పోలీస్‌ బందోబస్తు

ఇంటి చుట్టూ కాంగ్రెస్‌, బీజేపీ

నేతల చక్కర్లు

నిజామాబాద్‌ రూరల్‌: నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ 37వ డివిజన్‌ కార్పొరేటర్‌గా గెలుపొందిన బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ప్యాట విజయలక్ష్మి ఇంటి వ ద్ద శుక్రవారం రాత్రి హైడ్రామా కొనసాగింది. కాంగ్రెస్‌, ఎంఐఎంకు పూర్తి మెజార్టీ ఉన్నా.. బలం పెంచుకునేందుకు విజయలక్ష్మి మద్దతు కోసం కాంగ్రెస్‌ నాయకులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆమెతో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. అదేసమయంలో 28 స్థానాల్లో విజయం సాధించిన బీజేపీ సైతం మద్దతు కోసం చర్చలు జరుపుతోంది. దీంతో నగరంలోని దుబ్బ ప్రాంతంలోని కట్ట మైసమ్మ కెనాల్‌ కట్ట వద్ద ఉన్న ఆమె ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. రెండు పార్టీల నాయకుల నుంచి ఒత్తిళ్లు వస్తుండగా.. విజయలక్ష్మి మద్దతు ఎవరికి ఉంటుందో వేచి చూడాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement