స్వల్ప ఉద్రిక్తతలు | - | Sakshi
Sakshi News home page

స్వల్ప ఉద్రిక్తతలు

Feb 12 2026 11:27 AM | Updated on Feb 12 2026 11:27 AM

స్వల్

స్వల్ప ఉద్రిక్తతలు

నిజామాబాద్‌ అర్బన్‌: నగరంలోని 52వ డివిజన్‌ పరిధిలో ఉన్న గోల్డెన్‌జూబ్లీ పాఠశాల పోలింగ్‌ కేంద్రం వద్ద కాంగ్రెస్‌ నాయకులు ప్రచారం చేస్తున్నారని ఎంఐఎం కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. ఇరువర్గాలను అక్కడి నుంచి వెళ్లిపోవాలని పోలీసులు సూచించినప్పటికీ మాట వినకపోవడంతో సీపీ సాయిచైతన్య అక్కడికి చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు. స్వల్ప లాఠీచార్జి చేశారు. మరొకరి ఓటువేసేందుకు ప్రయత్నించిన ఓ యువతిని పోలింగ్‌ సిబ్బంది గుర్తించి పోలీసులకు అప్పగించారు. మరో ఇదే సెంటర్‌లో మరో ఇద్దరిపై దొంగ ఓటింగ్‌ కేసులు నమోదయ్యాయి.

● 18వ డివిజన్‌ పరిధిలోని ముబారక్‌నగర్‌ ప్రభుత్వ పాఠశాల పోలింగ్‌ కేంద్రంలో దొంగ ఓటు వేసేందుకు వచ్చిన ఓ వ్యక్తిని పోలింగ్‌ ఏజెంట్లు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

● 19వ డివిజన్‌ పరిధిలోని గూపన్‌పల్లి ప్రాంతంలో ఉన్న ప్రైవేట్‌ పాఠశాల పోలింగ్‌ కేంద్రం వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున గుమిగూడారు. పోలీసులు రెండు పార్టీల నాయకులు, కార్యకర్తలను చెదరగొట్టారు. బీజేపీ నాయకులు నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌, కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు నగేశ్‌రెడ్డితోపాటు ఇతర సీనియర్‌ నాయకులు ఆరోపించారు. మరోవైపు అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ వచ్చి కాంగ్రెస్‌ నాయకులు ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని ఆరోపించారు. ఇరువురు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడంతో కార్యకర్తలు పెద్ద ఎత్తున గూమిగుడారు. వీరిని సీపీ సాయిచైతన్య సిబ్బందితో కలిసి చెదరగొట్టారు.

● పోలీస్‌ కమిషనర్‌ సాయిచైతన్య నగరంలోని పలు పోలింగ్‌ కేంద్రాలను సందర్శించి బందోబస్తును పర్యవేక్షించారు. సీపీ వెంట ఏసీపీ ప్రకాశ్‌, ఎస్‌హెచ్‌వో సతీశ్‌ తదితరులున్నారు.

● 11వ డివిజన్‌లోని బాబన్‌సాహెబ్‌ పహాడ్‌లోని పోలింగ్‌ కేంద్రంలో ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్‌ నాయకులను ఎంఐఎం నాయకులు ప్రశ్నించగా గొడవ ప్రారంభమైంది. ఎంఐఎం అభ్యర్థి కరీంతోపాటు మరికొందరిపై కాంగ్రెస్‌ నాయకులు దాడి చేశారు. ఎంఐఎం నాయకులు పక్కనే ఉన్న డ్రైనేజీలో పడిపోయారు. ఎంఐఎం అభ్యర్థి కరీం గాయాలపాలయ్యారు. ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు.

● మాలపల్లిలోని పోలింగ్‌ కేంద్రంలో ఎంఐఎం నాయకులపై కాంగ్రెస్‌ నాయకులు దాడిచేశారు. పోలింగ్‌ కేంద్రంలోకి కాంగ్రెస్‌ నాయకులు ఎందుకు వెళుతున్నారని ప్రశ్నించినందుకు కాంగ్రెస్‌ నాయకులు దాడిచేసినట్లు తెలిసింది.

● 34వ డివిజన్‌ ఓటింగ్‌ జరుగుతున్న హరిచరణ్‌ మార్వాడి పాఠశాల పోలింగ్‌కేంద్రంలో 60 ఏళ్ల వృద్ధురాలి ఓటును 30 ఏళ్ల మహిళ వేశారని దీనిపై బీజేపీ నాయకుడు ప్రవీణ్‌ పోలింగ్‌ అధికారులను ప్రశ్నించారు. మరో నలుగురు మహిళలు ఓటువేసేందుకు రాగా వారి ఓట్లను అప్పటికే ఇతరులు వేసేశారు. నలుగురు మహిళలపై దీనిపై అధికారులను ప్రశ్నించారు. బీజేపీ నాయకులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఎంపీ అర్వింద్‌ అక్కడికి చేరుకుని అధికారులను ప్రశ్నించారు. బీజేపీ అభ్యర్థిని బయటికి పంపించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు అక్కడికి చేరుకొని బీజేపీ నాయకులను సముదాయించారు.

● 20వ డివిజన్‌లోని బీజేపీ అభ్యర్థి న్యాలం సునీత భర్త న్యాలం రాజుపై కాంగ్రెస్‌ అభ్యర్థి లలిత కుమారుడు దాడి చేశాడు.

వాగ్వాదానికి దిగిన వారిని

చెదరగొట్టిన పోలీసులు

11వ డివిజన్‌లో కాంగ్రెస్‌ – ఎంఐఎం మధ్య లొల్లి

ఎంఐఎం అభ్యర్థి కరీంకు గాయాలు

20వ డివిజన్‌లో

బీజేపీ నాయకుడిపై దాడి

పలుచోట్ల దొంగ ఓటర్ల పట్టివేత

ఆర్మూర్‌ పట్టణంలోని పెద్ద బజార్‌లో ఉన్న ప్రభుత్వ పాఠశాల పోలింగ్‌ కేంద్రంలో 30వ వార్డుకు చెందిన బ్యాలెట్‌ పేపర్లలో 34వ వార్డుకు చెందిన స్వతంత్ర అభ్యర్థుల గుర్తులతో బ్యాలెట్‌ పేపర్లు రావడంతో సిబ్బంది రెండు ఓట్లను రద్దు చేసి వారితో తిరిగి ఓటు వేయించారు. దీంతో ఆర్మూర్‌ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి పోలింగ్‌ కేంద్రానికి వచ్చి పోలీసులు, ఎన్నికల సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.

స్వల్ప ఉద్రిక్తతలు 1
1/4

స్వల్ప ఉద్రిక్తతలు

స్వల్ప ఉద్రిక్తతలు 2
2/4

స్వల్ప ఉద్రిక్తతలు

స్వల్ప ఉద్రిక్తతలు 3
3/4

స్వల్ప ఉద్రిక్తతలు

స్వల్ప ఉద్రిక్తతలు 4
4/4

స్వల్ప ఉద్రిక్తతలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement