పంట వెనుక పంట
● పసుపు సాగైన భూముల్లో
నువ్వు, సజ్జ సాగు
● మూడు నెలల్లో చేతికిరానున్న
స్వల్పకాలిక పంటలు
డొంకేశ్వర్(ఆర్మూర్): పంట వెనుక పంట సాగు చే స్తూ జిల్లాలోని పలు ప్రాంతాల్లో రైతులు బిజీగా ఉ న్నారు. పసుపు సాగు పూర్తి చేసిన రైతులు ఆ భూ ముల్లోనే స్వల్పకాలిక పంటలు వేస్తున్నారు. మూడు నెలల్లో చేతికొచ్చే సజ్జ, నువ్వులను సాగు చేసేందు కు ఆసక్తి చూపుతున్నారు. జొన్నలకు రేటు తక్కువ గా ఉండడంతో సజ్జ సాగు వైపు వెళ్తున్నారు. నువ్వులకు సైతం రానున్న రోజుల్లో ధర వచ్చే అవకాశం ఉందనే నమ్మకంతో రైతులు ముందుకొస్తున్నారు. కొంతమంది కర్బూజ సాగు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 11,787 ఎకరాల్లో సజ్జ, నువ్వులు 8,239 ఎకరాల్లో సాగవుతుందని వ్యవసాయ శాఖ అంచ నా వేసింది. పసుపు తవ్వకాలు పూర్తి కావడంతో ప్రస్తుతం అవే భూములను సజ్జలు, నువ్వుల కోసం సిద్ధం చేస్తున్నారు. మార్చి వరకు విత్తనాలు వేసుకోవడానికి అవకాశం ఉందని వ్యవసాయాధికారు లు చెబుతున్నారు. సజ్జ, నువ్వు పంటలు జూన్ నా టికి చేతికి రానున్నాయి. పరిస్థితులు బాగుంటే సజ్జ ఎకరానికి 10 నుంచి 12 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. అదే నువ్వుల విషయానికి వస్తే ఎకరానికి 3 నుంచి 4 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. సజ్జ, నువ్వు పంటలు పూర్తి కాగానే వర్షాలు కురిసే సమయానికి రైతులు సోయా సాగు చేస్తారు. అనంతరం మళ్లీ పసుపు సాగుకు సన్నద్ధమవుతారు.
నాలుగు ఎకరాల్లో సజ్జ
పసుపు పంట తీయగానే నా లుగు ఎకరాల్లో సజ్జ వేశాను. క్వింటాల్‌కు రూ.4,200 చొ ప్పున ఒప్పందం జరిగింది. నువ్వుతో పోలిస్తే వాతావరణ పరిస్థితులను సజ్జ తట్టు కుంటుంది. పంట మూడు నెలల్లో చేతికి వస్తుంది.
– గజ్జల రవీందర్, రైతు, డొంకేశ్వర్
పంట వెనుక పంట


