పుణ్యస్నానాల గంగ
డొంకేశ్వర్(ఆర్మూర్): తల్లి కడుపులో బిడ్డ పడినా.. పండంటి బిడ్డ పుట్టినా ముందు మొక్కేది ఆ గంగమ్మ తల్లికే. పిల్లల పుట్టు వెంట్రుకలు.. ఖుషీ తెప్పలు.. పుణ్యస్నానాలతో నికాల్‌పూర్ గంగ (గోదావరి)ఆధ్యాత్మిక శోభతో అలరారుతోంది. జిల్లాలో పుణ్య స్నానాలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతాల్లో ఇదొకటి. చుట్టు పక్కల గ్రామాల నుంచే కాకుండా జిల్లా నలు మూలల నుంచి ఇక్కడికి ప్రజలు వస్తుంటారు. ప్రతి శుక్ర, సోమవారాల్లో గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి తెప్పలతో మొక్కులు చెల్లిస్తారు. ఏమి లేకున్నా గంగమ్మ తల్లిని మరువకూడదనే భక్తితో, ప్రేమతో ఏడాదికోసారి ఖుషీ తెప్పను వదులుతారు. ప్రతి అమవాస్య, పౌర్ణమి నాడే కాకుండా ఏటా కార్తీక పౌర్ణమి రోజుల్లోనైతే భక్తుల తాకిడి మరింత ఎక్కువ ఉంటుంది. పచ్చని చెట్లు, పరుచుకున్న గడ్డి, జల సవ్వడుల ప్రకృతి నడుమల పిల్లలు, పెద్దలు ఎంజాయ్ చేస్తారు.
పుష్కర ఘాట్‌కు అనువైన స్థలం
భక్తులు పుష్కర స్నానాలు ఆచరించేందుకు నికాల్‌పూర్ గంగ (గోదావరి) ఎంతో అనువైన స్థల మని, అధికారులు స్పందించి ఘాట్‌ను నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు. జిల్లాలోని పదకొండుకు పైగా ప్రాంతాల్లో పుష్కరాలను నిర్వహిస్తుండగా ప్రసిద్ధి చెందిన నికాల్‌పూర్ గోదావరి వద్ద కూడా నిర్వహించాలని కోరుతున్నారు.
ఆధ్మాత్మిక శోభతో అలరారుతున్న
నికాల్‌పూర్ గోదావరి
ప్రతి శుక్ర, సోమవారాల్లో జనసందోహం
జిల్లా నలుమూలల నుంచి రాక
గోదావరి పుష్కరాలకు అనువైన ప్రాంతం
పుణ్యస్నానాల గంగ


