విద్యా వ్యవస్థలో మార్పు రావాలి
● సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి
తక్కలపల్లి శ్రీనివాసరావు
ఖలీల్‌వాడి: రాష్ట్ర విద్యా వ్యవస్థలో మార్పు రావాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి, ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు తక్కలపల్లి శ్రీనివాసరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని పులాంగ్ వద్ద ఉన్న ఓ ఫంక్షన్‌హాల్‌లో గురువారం ఏఐఎస్‌ఎఫ్ జెండాను శ్రీనివాస్‌రావు ఆవిష్కరించారు. పూర్వ జాతీయ అధ్యక్షుడు, రాష్ట్ర ఏఐఎస్‌ఎఫ్ కార్యదర్శి శివ రామకృష్ణ, సీపీఐ జిల్లా కార్యదర్శి పీ సుధాకర్ అమరవీరుల స్థూపం వద్ద భగత్ సింగ్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. రెండో రోజు నిర్వహించిన సమావేశానికి ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మణికంఠరెడ్డి అధ్యక్షత వహించారు. ఇటీవల మృతి చెందిన వామపక్ష, అభ్యుదయవాద జాతీయ, రాష్ట్ర, జిల్లా అమరవీరులకు రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు.
అనంతరం శ్రీనివాసరావు మాట్లాడుతూ.. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే దిశగా ఏఐఎస్‌ఎఫ్ పోరాటాలు చేస్తోందని అన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన ఏఐఎస్‌ఎఫ్ జాతీయ కార్యదర్శి దినేశ్ శివలింగ రాజన్ మాట్లాడుతూ.. యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు కమ్యూనిస్టు పార్టీల ద్వారా ఆహార భద్రత చట్టం తీసుకొస్తే, మోదీ ప్రభుత్వం వీజీరాంజీ చట్టం పేరుతో ఆహార భద్రత లేకుండా చేస్తోందని మండిపడ్డారు. అనంతరం సౌహార్థ సందేశాన్ని ఏఐఎస్‌ఎఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి బందెల నాసర్‌జీ, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు అందించారు.
కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుట్ట లక్ష్మణ్, రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ ఇటుకెల రామకృష్ణ, రఘురాం, సుబోధ్, గ్యార నరేశ్ రెహమాన్, నాగజ్యోతి, గ్యార క్రాంతి, లెనిన్, రాజు, ప్రవీణ్, బరిగల వెంకన్న, ఏఐటీయూసీ రైతు సంఘం రాష్ట్ర నాయకులు యాసూఫ్, బాలరాజు, భూమయ్య, మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి జ్యోతి, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి వై ఓమయ్య, ఎండీఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు చక్రపాణి, సీపీఐ నాయకులు రాజేశ్వర్, రాజు రెడ్డి, రాజన్న, స్వరూపరాణి, గంగామణి, జిల్లా సహాయ కార్యదర్శి కుషాల్, కార్తీక్, కోశాధికారి అనూష, నాయకులు హాసిని, కిశోర్, నిఖిల్, గౌతం, దిలీప్, ప్రవీణ్, సోను రాజ్, ఆకాశ్, కృతిక్ పాల్గొన్నారు.
విద్యా వ్యవస్థలో మార్పు రావాలి
విద్యా వ్యవస్థలో మార్పు రావాలి


