నేటి నుంచి శివపురాణం ప్రవచనం | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి శివపురాణం ప్రవచనం

Feb 13 2026 5:23 AM | Updated on Feb 13 2026 5:23 AM

నేటి

నేటి నుంచి శివపురాణం ప్రవచనం

శంకర్‌కు డాక్టరేట్‌ సైబర్‌ మోసాలపై అవగాహన

పలుగుట్టలో మూడురోజులపాటు

ప్రవచనాలు

మంగి రాములు మహరాజ్‌

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం నుంచి ఈ నెల 15వ తేదీ వరకు నందిపేట మండలంలోని పలుగుట్ట కేదారేశ్వర ఆశ్రమంలో ప్రవచన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు మంగి రాములు మహరాజ్‌ తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం ‘సాక్షి’తో మాట్లాడారు. గండ్ర ప్రేమ్‌సాగర్‌రావు సౌజన్యంతో చేస్తున్న ఈ కార్యక్రమాల్లో ప్రముఖ ప్రవచనకర్త ఆచార్య వాసుదేవ్‌జీ ప్రవచనాలు చెప్పనున్నట్లు పేర్కొన్నారు. మూడు రోజులపాటు మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రవచన కార్య క్రమం ఉంటుందన్నారు. ఇందులో శివమహాపురాణం ఉంటుందని వివరించారు. తెలంగాణ, మహారాష్ట్ర నుంచి భక్తులు కుటుంబాలతో కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు.

కమ్మర్‌పల్లి(భీమ్‌గల్‌): భీమ్‌గల్‌ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల జంతుశాస్త్ర అధ్యాపకుడు సిక్కాల శంకర్‌కు రాజస్థాన్‌లోని శ్రీజగదీశ్‌ ప్రసాద్‌ జబర్మల్‌ టిబ్రీవాలా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్‌ లభించింది. ప్రొఫెసర్‌ నీతుసింగ్‌ పర్యవేక్షణంలో ‘మేనేజిరల్‌ ఆన్‌పెక్ట్‌ అండ్‌ బయలాజికల్‌ స్టడీస్‌ ఆన్‌ పౌల్ట్రీఫాం ఇన్‌ నిజామాబాద్‌ డిస్ట్రిక్ట్‌’ అనే అంశంపై పరిశోధన చేశారు. గురువారం కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ హెచ్‌ సతీశ్‌, అధ్యాపకులు అభినందనలు తెలిపారు. వైస్‌ ప్రిన్సిపాల్‌ బీ సుమలత, డాక్టర్‌ బీ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

నిజామాబాద్‌ అర్బన్‌: సైబర్‌ మోసాలపై సైబర్‌ క్రైమ్‌ పోలీసులు గురువారం కాకతీయ జూనియర్‌ కళాశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. ప్రస్తుత కాలంలో సాంకేతిక పరిజ్ఞానం విస్తృతంగా అభివృద్ధి చెందడంతో పాటు, సైబర్‌ నేరాల సంఖ్య పెరుగుతోందన్నారు. ముఖ్యంగా ఇన్వెస్ట్‌మెంట్‌ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయని అధిక లాభాలు వస్తాయని నమ్మబలికే నకిలీ వెబ్‌సైట్లు, యాప్‌లు, సోషల్‌ మీడియా ప్రకటనల ద్వారా ప్రజలను మోసం చేస్తున్నారని వివరించారు. కొద్దిపాటి పెట్టుబడితో భారీ లాభాలు వస్తాయని చెప్పి ప్రజల డబ్బును దోచుకునే ఘటనలు పెరుగుతున్నాయని తెలిపారు. ఇలాంటి మోసాలకు గురికాకుండా ఉండాలంటే ఏ పెట్టుబడి పెట్టే ముందు ఆ సంస్థపై పూర్తి వివరాలు సేకరించాలని, అపరిచిత కాల్స్‌ను నమ్మకూడదని సూచించారు. కార్యక్రమంలో సైబర్‌ క్రైమ్‌ పోలీసులు, కాకతీయ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.

నేటి నుంచి  శివపురాణం ప్రవచనం 1
1/2

నేటి నుంచి శివపురాణం ప్రవచనం

నేటి నుంచి  శివపురాణం ప్రవచనం 2
2/2

నేటి నుంచి శివపురాణం ప్రవచనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement