ఐదు లక్షల ఎకరాలు దాటి.. | - | Sakshi
Sakshi News home page

ఐదు లక్షల ఎకరాలు దాటి..

Feb 15 2026 6:48 AM | Updated on Feb 15 2026 6:48 AM

ఐదు ల

ఐదు లక్షల ఎకరాలు దాటి..

డొంకేశ్వర్‌(ఆర్మూర్‌): జిల్లాలో వరినాట్లు దాదాపు గా ముగియడంతో యాసంగి సీజన్‌లో సాగవు తున్న పంటల లెక్క తేలింది. 5.22లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేయగా 5 లక్షల ఎకరాలు దాటింది. అత్యధికంగా వరి 4.25లక్షల ఎకరాల్లో సాగవుతోంది. మరో వెయ్యి ఎకరాల వరకు సాగు విస్తీర్ణం పెర గొచ్చని అధికారులు భావిస్తున్నారు. రైతులు 80 శాతం వరకు వరిలో సన్నాలే వేయగా గంగాకావేరి రకం ఎక్కువగా ఉంది. వరి తర్వాత రైతులు మొక్కజొన్నకు అధిక ప్రాధాన్యత ఇచ్చి సీడ్‌కు వెళ్లారు. అలాగే బోధన్‌ డివిజన్‌లో ఎక్కువగా శనగ, పొగాకు పంటలను సాగు చేస్తున్నారు. బోర్లు లేని రైతులు జలాశయాలు, లిఫ్టుల సా గు నీటితో పంటలను పండిస్తున్నారు. వ్యవ సాయ శాఖ కూడా యాసంగికి సరిపడా ఎరువులు తెప్పించడంతో రైతులకు బయట ఎప్పటికప్పుడు యూరి యా లభిస్తోంది. ఇటు ఏఈవోలు, ఏవోలు వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లి రైతు వారీగా సాగు చేస్తున్న పంటల వివరాలను ఆన్‌లైన్‌లో నమో దు చేసే పనిలో నిమగ్నమయ్యారు. క్రాప్‌ బుకింగ్‌ ఆధారంగానే రైతుల నుంచి ప్రభుత్వ పంటలను కొనుగోలు చేయనుంది.

జిల్లాలో సాగవుతున్న యాసంగి పంటలు

అత్యధికంగా 4.25లక్షల ఎకరాల

విస్తీర్ణంలో వరి సాగు

జిల్లాలో చివరి దశలో నాట్లు

ఐదు లక్షల ఎకరాలు దాటి.. 1
1/1

ఐదు లక్షల ఎకరాలు దాటి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement