ఎర్రజొన్నపై సిండికేట్‌ పిడుగు | - | Sakshi
Sakshi News home page

ఎర్రజొన్నపై సిండికేట్‌ పిడుగు

Feb 20 2026 6:31 AM | Updated on Feb 20 2026 6:31 AM

ఎర్రజ

ఎర్రజొన్నపై సిండికేట్‌ పిడుగు

సిండికేట్‌ను కట్టడి చేస్తేనే..

సాగు విస్తీర్ణం తగ్గినా పెరగని ధరలు

బైబ్యాక్‌ ఒప్పందానికి

ముందుకు రాని వ్యాపారులు

అసంతృప్తి వ్యక్తం చేస్తున్న రైతులు

మోర్తాడ్‌: ఆరుగాలం శ్రమించే రైతుకు అడుగడుగునా కష్టాలే. పండించిన పంటకు సర్కారు సహకా రం లేక వ్యాపారులు సిండికేట్‌గా మారి ఎర్రజొన్న రైతులను నిలువునా దోపిడీ చేస్తున్నారు. ఎర్రజొన్న సాగు చేసిన రైతులకు ఈ ఏడాది కూడా ఆశించిన ధర లభించేలా కనిపించడం లేదు. సాగు ఖర్చులు పెరిగినా ధరలో మార్పు లేకపోవడంతో గిట్టుబాటయ్యేలా లేదని రైతులు వాపోతున్నారు. ఎర్రజొన్న సాగు చేసే రైతులు సీడ్‌ వ్యాపారులతో బైబ్యాక్‌ ఒప్పందం చేసుకోవాలని అధికార యంత్రాంగం సూచించింది. బైబ్యాక్‌ ఒప్పందానికి వ్యాపారులు ముందుకు రాకపోవడం, సీజన్‌లో ఎక్కువ ధర చెల్లించిన వ్యాపారులకే విక్రయించడానికి రైతులు నిర్ణయించుకున్నారు. వ్యాపారులు మాత్రం సిండికేట్‌ కావడంతో ఎర్రజొన్నలకు ధర పెరగడం లేదని పేర్కొంటున్నారు. గత సీజన్‌లాగే ఈ సారి కూడా క్వింటాలుకు రూ.3,900 నుంచి రూ.4వేల వరకే ధర చెల్లిస్తామని వ్యాపారులు చె బుతున్నారు. కొన్నేళ్ల క్రితం రూ.6వేల వరకూ పలికిన ధర క్రమక్రమంగా తగ్గుతూ వస్తోంది. ఎర్రజొన్నకు ధర గతంలో మాదిరిగా పలుకడం లేదనే ఉ ద్దేశంతో అనేక మంది రైతులు ప్రత్యామ్నాయ పంటగా మొక్కజొన్నను సాగు చేస్తున్నారు. అడవి పందులు, చిలుకల వల్ల ఇబ్బంది అనుకునే రైతులే ఎర్రజొన్నలను సాగు చేస్తున్నారు. నాలుగేళ్ల క్రితం 30వేల ఎకరాల్లో సాగైన ఈ పంట గతేదాడి నుంచి సుమారు 8 వేల ఎకరాల విస్తీర్ణానికి పడిపోయింది. సాగు విస్తీర్ణం తగ్గడంతో ఉన్న కొద్ది పంటకు డి మాండ్‌ లభిస్తుందని రైతులు ఆశించారు. ధర మా త్రం పెరగకపోవడంతో రైతులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరాది రాష్ట్రాలతో పాటు పొ రుగు దేశాల్లో గడ్డి కోసం వినియోగించే ఎర్రజొన్న కు డిమాండ్‌ ఉన్నా వ్యాపారులు తమ లాభాలను పెంచుకోవడం కోసం ధర లేకుండా చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. సీడ్‌ వ్యాపారులను నియంత్రించే పరిస్థితి లేకపోవడంతో రైతులకు ఎర్రజొన్నల సాగు వల్ల లాభాలు పెరగడం లేదు.

ఎర్రజొన్నలు కొనుగోలు చేసే వ్యాపారుల సిండికేట్‌ను కట్టడి చేస్తేనే రైతులకు మేలు జరుగుతుంది. మార్కెట్‌లో ఎర్రజొన్నకు డిమాండ్‌ ఉన్నా రైతుల వద్దకు వచ్చేసరికి ధర లభించడం లేదు. కొన్నేళ్లుగా ఇదే పరిస్థితి నెలకొంది. సీజన్‌లో ధర పెరుగుతుందనే ఆశతో రైతులు ఎర్రజొన్నలను సాగు చేస్తున్నారు.

– కొమ్ముల వెంకటేశ్‌, రైతు, తిమ్మాపూర్‌

ఎర్రజొన్నపై సిండికేట్‌ పిడుగు 1
1/1

ఎర్రజొన్నపై సిండికేట్‌ పిడుగు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement