అధికార పార్టీదే పురం
పాలిటెక్నిక్ కళాశాలలో ఓట్లు లెక్కిస్తున్న ఎన్నికల సిబ్బంది
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: పురపాలక ఎన్నికల్లోనూ నిజామాబాద్ జిల్లాలో హస్తం హవా నడిచింది. ఆర్మూర్, బోధన్, భీమ్‌గల్ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు చైర్‌పర్సన్లు కానున్నారు. నిజామాబాద్ నగరపాలకంలో హంగ్ ఏర్పడింది. ఎంఐఎం మద్దతుతో కాంగ్రెస్ పార్టీ మేయర్ పీఠా న్ని కై వసం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. నిజామాబాద్‌లో బీజేపీ 28 సీట్లతో వరుసగా రెండోసారి అ తిపెద్ద పార్టీగా నిలిచింది. 2020 ఎన్నికల్లోనూ బీజే పీ 28 సీట్లే సాధించి మేయర్ పీఠానికి సమీపంలో ఆగిపోయింది. మళ్లీ ఈసారి ఇదే పరిస్థితి నెలకొన డం గమనార్హం. నగరపాలక ఓట్ల లెక్కింపు ప్రక్రి య ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది.
● ఇందూరులో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు మొత్తం 1,524 పోల్ కాగా ఇందులో బీజేపీ అభ్యర్థులు 755, కాంగ్రెస్ 476, ఎంఐఎం 95, బీఆర్‌ఎస్ అభ్యర్థులు 67 ఓట్లు సాధించారు. నోటాకు 9 ఓట్లు పడ గా, చెల్లని ఓట్లు 21 ఉన్నాయి. పోస్టల్ బ్యాలెట్ ఫలితాల నేపథ్యంలో ప్రధాన ఓట్ల లెక్కింపుపై ఆ సక్తి నెలకొంది. అయితే ప్రతి డివిజన్ విషయంలో నూ పోటాపోటీ నడవడంతో అద్యందం ఉత్కంఠభరి తం అయింది. దీంతో లెక్కింపు బాగా ఆలస్య మైంది. బీజేపీ 28, కాంగ్రెస్ 17, ఎంఐఎం 14, బీఆర్ ఎస్ ఒక చోట గెలిచాయి. 2020లో కేవలం రెండు సీట్లు గెలిచిన కాంగ్రెస్ ఇప్పుడు 17 సీట్లు గెలిచింది. గతంలో 13 సీట్లు గెలిచిన బీఆర్‌ఎస్ ఈసారి కేవలం ఒక సీటుతో సరిపెట్టుకుంది. క్రితంసారి 16 సీట్లు గెలిచిన ఎంఐఎం ఈసారి 14 సీట్లు సాధించింది. ఇందూరు బల్దియాలో వరుసగా మూడోసారి హంగ్ నెలకొనడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఎక్స్ అఫీషియో ఓట్లపై చర్చ జరుగుతోంది. కాంగ్రెస్‌కు ఎమ్మెల్యే భూపతిరెడ్డి, ఎమ్మెల్సీ మహేశ్ గౌడ్ ఓట్లు ఉన్నాయి. హైదరాబాద్‌కు చెందిన రాజ్యసభ సభ్యుడు అనిల్‌యాదవ్ నిజామాబాద్‌లో ఓటు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా బీజేపీకి ఎంపీ అర్వింద్, ఎమ్మెల్యేలు ధన్‌పాల్ సూర్యనారాయణ, పైడి రాకేష్ రెడ్డి, ఎమ్మెల్సీలు చిన్నమైల్ అంజిరెడ్డి, మల్క కొమురయ్య ఉన్నారు. అయినప్పటికీ సమీకరణలు పరిశీలిస్తే మేయర్ పీఠం దక్కే అవకాశం లేకుండా పోయింది. గతంలో ఎక్స్ అఫీషి యో ఓట్లు తగినన్ని లేక, ఇప్పుడు ఎక్స్ అఫీషియో ఓట్లు ఉన్నప్పటికీ నంబర్ గేమ్‌లో మేయర్ పీఠానికి బీజేపీ దూరమవుతోంది.
● బోధన్‌లో 38 వార్డులకు కాంగ్రెస్ 17, బీఆర్‌ఎస్ 5, బీజేపీ 3, ఎంఐఎం 12, స్వతంత్రులు 1 చోట గెలుపొందారు. ఇక్కడ స్వతంత్ర, ఎక్స్ అఫీషియో ల ద్వారా కాంగ్రెస్ చైర్మన్ పీఠం దక్కించుకోనుంది. ఇక్కడ తూము శరత్‌రెడ్డికి చైర్మన్ అవకాశం దక్కనున్నట్లు తెలుస్తోంది. 2020 ఎన్నికల్లో శరత్‌రెడ్డి సతీమణి చైర్‌పర్సన్‌గా పనిచేశారు. ఇక భీమ్‌గల్ మున్సిపాలిటీలో 12 వార్డులకు కాంగ్రెస్ 08, బీఆర్‌ఎస్ 04 చోట్ల గెలిచాయి.
ఆర్మూర్ మున్సిపాలిటీలో 36 వార్డులు న్నాయి. ఇక్కడ కాంగ్రెస్ 19, బీజేపీ 8, బీఆర్‌ఎస్ 5, ఎంఐఎం 1, స్వతంత్రులు ముగ్గురు గెలిచారు. అయితే ఇక్కడ చైర్‌పర్సన్ ఆశావహులు ఏబీ శ్రీదేవి, ఖాందేశ్ సంగీత ఓటమిపాలు కావడం గమనార్హం. అసలు ఏమాత్రం అంచనాలు లేని మహిళ ఆర్మూర్‌లో చైర్‌పర్సన్ కానుండడం విశేసం.
ఆర్మూర్, భీమ్‌గల్, బోధన్
మున్సిపాలిటీలు ‘హస్త’గతం
నిజామాబాద్‌లోనూ ఎంఐఎం
మద్దతుతో మేయర్ పీఠంపై కాంగ్రెస్!
ఇందూరులో ఓట్ల లెక్కింపులో
ఆద్యంతం ఉత్కంఠభరితం
ఇందూరు నగరపాలకంలో
మరోసారి విలక్షణ ఫలితం
బీజేపీ 28, కాంగ్రెస్ 17, ఎంఐఎం 14, బీఆర్‌ఎస్ ఒక చోట విజయం
వరుసగా రెండోసారి 28 సీట్ల వద్ద
ఆగిన బీజేపీ
కార్పొరేషన్‌లో వరుసగా
మూడోసారి హంగ్


