మతవిద్వేషాలు రెచ్చగొట్టినా కాంగ్రెస్‌కే పట్టం | - | Sakshi
Sakshi News home page

మతవిద్వేషాలు రెచ్చగొట్టినా కాంగ్రెస్‌కే పట్టం

Feb 14 2026 9:59 AM | Updated on Feb 14 2026 9:59 AM

మతవిద

మతవిద్వేషాలు రెచ్చగొట్టినా కాంగ్రెస్‌కే పట్టం

నిజామాబాద్‌ రూరల్‌: బీజేపీ నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో మతం పేరుతో రె చ్చగొట్టినా కాంగ్రెస్‌కు మంచి ఫలితాలు వచ్చాయని టీపీసీసీ చీఫ్‌ బొమ్మ మహేశ్‌కు మార్‌ గౌడ్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్‌ భవన్‌లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజాపాలన ప్రభుత్వంలో సంక్షేమం అభివృద్ధికి పట్టం కట్టడం శుభ పరిణామమన్నారు. భవిష్యత్‌లో ప్రజలు కాంగ్రెస్‌ పార్టీకి అండగా ఉండాలని ఆకాంక్షిచారు. 2029 అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం రేవంత్‌ రెడ్డి నేతృత్వంలో వచ్చే ఎన్నికల్లోనూ 100 సీట్లు గెలిచి సత్తా చాటుతామని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షు డు నగేశ్‌రెడ్డి, నగర అధ్యక్షుడు బొబ్బిలి రా మకృష్ణ, నుడా చైర్మన్‌ కేశవేణు, రాష్ట్ర సహకార లిమిటెడ్‌ యూనియన్‌ చైర్మన్‌ మానాల మోహన్‌రెడ్డి, పీసీసీ డెలిగేట్‌ బాడ్సి శేఖర్‌గౌడ్‌, డీసీసీ జనరల్‌ సెక్రెటరీ భాస్కర్‌రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్‌ తాహెర్‌బిన్‌హుందాన్‌, రైతు కమిషన్‌ సభ్యుడు గడుగు గంగాధర్‌, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రాంభూపాల్‌, జావిద్‌అక్రమ్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం

కమ్మర్‌పల్లి(భీమ్‌గల్‌): భీమ్‌గల్‌ ము న్సిపల్‌ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు ను గౌరవిస్తున్నామని మాజీ మంత్రి, ఎమ్మె ల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం శుక్రవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. ఓడినా ప్రజల పక్షాన నిలబడి హామీల సాధన కోసం బీఆర్‌ ఎస్‌ పోరాడుతూనే ఉంటుందని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌కు ఓటు వేసిన పట్టణ ప్రజలకు, పార్టీ అభ్యర్థుల విజయం కోసం కష్టపడిన నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. విజయం సాధించిన కౌన్సిలర్లకు ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకొని పారదర్శకంగా సేవ చేయాలని ఆకాంక్షించారు.

ఆర్టీసీ వృద్ధికి చర్యలు తీసుకోవాలి

నిజామాబాద్‌ రూరల్‌: టీజీఎస్‌ఆర్టీసీ సంస్థ వృద్ధికి చర్యలు తీసుకోవాలని రీజినల్‌ మేనేజర్‌ జోత్స్న అధికారులు, సిబ్బందికి సూచించారు. ఆర్టీసీ సంస్థ నిజామాబాద్‌ రీజియన్‌ ఆర్థిక పరిస్థితిని, ఆదాయ వృద్ధి, వ్యయ ని యంత్రణ మార్గాలపై శుక్రవారం మేధో మ థన సమావేశం నిర్వహించారు. సంస్థ వృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అకౌంట్‌ ఆఫీసర్‌ స్వరూపారాణి, పద్మజ, డి పో మేనేజర్లు, ట్రాఫిక్‌ మెయింటెనెన్స్‌ సూపర్‌వైజర్లు, ఏడీసీలు, డ్రైవర్లు, కండక్టర్లు, ఆ యా విభాగాధిపతులు, సిబ్బంది హాజరై త మ అభిప్రాయాలు, సూచనలను తెలిపారు.

మతవిద్వేషాలు రెచ్చగొట్టినా కాంగ్రెస్‌కే పట్టం 1
1/1

మతవిద్వేషాలు రెచ్చగొట్టినా కాంగ్రెస్‌కే పట్టం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement