శంభో శంకరా..
సాక్షి నెట్‌వర్క్: మహాశివరాత్రి వేడుకలు జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ఆదివారం అత్యంత వైభవంగా జరిగాయి. శంభో శంకరా.. ఓం నమశ్శివాయ అంటూ భక్తుల నామస్మరణతో శివాలయాలు హోరెత్తాయి. జిల్లా కేంద్రంలోని నీలకంఠేశ్వర ఆలయం, ఉమామహేశ్వర ఆలయం, శంభుని ఆలయం, నాగారంలోని నందిగుట్ట ఆలయం, ఆర్మూర్‌లోని సిద్ధులగుట్ట, సిరికొండలోని లొంక రామలింగేశ్వర ఆలయాలతో పాటు పలు శివాలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అర్చనలు జరిగాయి. శంభు లింగేశ్వర ఆలయంలో, నీలకంఠేశ్వరాలయాల్లో అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ, సీపీ సాయి చైతన్య ప్రత్యేక పూజలు చేశారు. పోలీసులు బందోబస్తు చేపట్టారు.


