ఎవరి ప్రయత్నాలు వారివే..
నిజామాబాద్‌లో పార్టీల వారీగా సాధించిన ఓట్లు
● కలెక్టర్ ఇలా త్రిపాఠి
● ప్రత్యేక సమావేశం ఏర్పాట్ల పరిశీలన
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : మేయర్, మున్సిపల్ చైర్‌పర్సన్ల ఎన్నిక నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యా ప్తంగా తీవ్ర ఉత్కంఠ, ఆసక్తి నెలకొన్నాయి. సోమ వారం ఎన్నికకు ఏర్పాట్లను పూర్తి చేశారు. నిజామా బాద్ కార్పొరేషన్‌తోపాటు బోధన్, కామారెడ్డిలో హంగ్ నెలకొనడంతో ఎవరు మేయర్, చైర్‌పర్సన్లు అవుతారనే అంశం సర్వత్రా చర్చనీయాంశమైంది. బోధన్ విషయంలో కొంతమేర ప్రతిష్టంభన నెలకొన్నప్పటికీ ఆదివారం రాత్రికి కొలిక్కి వచ్చినట్లు తె లుస్తోంది. కాంగ్రెస్‌తో కలిసి వెళ్లేందుకు ఎంఐఎం అభ్యర్థులు వ్యతిరేకించగా, దారుస్సలాం నుంచి వ చ్చిన ఆదేశాల మేరకు అంగీకరించారు. చైర్మన్‌గా శరత్‌రెడ్డిని మొదట అంగీకరించకపోగా.. ఎంఐఎం అధినాయకత్వం సూచనల మేరకు చివరకు అంగీకారం కుదిరినట్లు సమాచారం.
నిజామాబాద్ మేయర్ విషయంలో మాత్రం ఎనలేని ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్‌కు మేయర్, ఎంఐఎంకు డిప్యూటీ మేయర్ పంచుకునేలా అంగీకా రం కుదిరింది. మేయర్ కోసం నలుగురు మహిళా ఆశావహుల మధ్య పోటీ నెలకొంది. ఎవరి స్థాయి లో వారు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్, ఎంఐఎం కలిస్తే మ్యాజిక్ ఫిగర్ వస్తున్నప్పటికీ మ్యా జిక్ ఫిగర్‌కు సమీపంలో ఉన్న బీజేపీ ఎలాంటి వ్యూ హం అనుసరిస్తుందన్న దానిపై ఆసక్తి నెలకొంది.
కామారెడ్డి విషయానికి వస్తే ఇక్కడ కాంగ్రెస్, బీజేపీలకు మ్యాజిక్ ఫిగర్ రాలేదు. దీంతో బీఆర్‌ఎస్ కింగ్ మేకర్ అయ్యే పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ మాత్రం బీఆర్‌ఎస్ అభ్యర్థులతో చర్చలు జరుపుతోంది. కాంగ్రెస్ చైర్మన్ పదవి తీసుకుని బీఆర్‌ఎస్‌కు వైస్ చైర్మన్ ఇచ్చేలా చర్చలు నడుస్తున్నాయి. ఇక ఆర్మూర్, భీమ్‌గల్, బాన్సువాడ, ఎల్లారెడ్డి, బిచ్కుంద మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌కు పూర్తి ఆధిక్యం ఉంది. అయితే చైర్‌పర్సన్లుగా ఎవరు అవుతారనే విషయమై ఆసక్తి నెలకొంది.
లక్ష్యం దిశగా..
ఆర్మూర్‌కు సీల్డ్ కవర్..!
పార్టీ పోలైన ఓట్లు శాతం
కాంగ్రెస్ 69,942 33.68
బీజేపీ 65,989 31.78
బీఆర్‌ఎస్ 18,273 8.80
ఆప్ 10 0.00
ఏఐఎఫ్‌బీ 750 0.36
ఏఐఎంఐఎం 37,955 18.28
ఏఐఎంఐఎం ఇంక్విలాబ్ 5 0.00
బీఎస్పీ 193 0.09
సీపీఐ 110 0.05
సీపీఎం 101 0.05
స్వతంత్రులు 9,330 4.49
జేఎస్‌పీ 1,127 0.54
ఎంబీటీ 496 0.24
ఎంజేజేపీ 153 0.07
ఎస్‌పీఐ 2 0.00
డబ్ల్యూపీఐ 59 0.03
చెల్లని ఓట్లు 2,218 1.07
నోటా 939 0.45
మొత్తం 2,07,652 100.00
ఇందూరు మేయర్ ఎవరో?
కొనసాగుతున్న ఉత్కంఠ
కాంగ్రెస్‌కు మేయర్, ఎంఐఎంకు డిప్యూటీ మేయర్ ఇచ్చేలా ఒప్పందం
బోధన్‌లోనూ కాంగ్రెస్, ఎంఐఎం
కలిసి కౌన్సిల్ ఏర్పాటుకు లైన్ క్లియర్
కామారెడ్డిలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్
మధ్య చర్చలు
ఎవరి ప్రయత్నాలు వారివే..


