వృద్ధురాలి అదృశ్యం | - | Sakshi
Sakshi News home page

వృద్ధురాలి అదృశ్యం

Mar 9 2026 7:43 AM | Updated on Mar 9 2026 7:43 AM

వృద్ధురాలి అదృశ్యం

మోపాల్‌: మండలంలోని న్యాల్‌కల్‌ గ్రామానికి చెందిన కంటేగారి జానాబాయి అదృశ్యమైనట్లు ఎస్సై జాడె సుస్మిత ఆదివారం తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. జానాబాయి న్యాల్‌కల్‌లోని తన ఇంట్లో ఒంటరిగా నివసిస్తోంది. భర్త నర్సింగ్‌రావు గతంలోనే చనిపోయాడు. వీరికి పిల్లలు లేరు. ఈనెల 4న ఉదయం 7 గంటలకు కామారెడ్డి జిల్లా అంబార్‌పేట్‌లోని తన సోదరి ఇంటికి వెళ్తున్నానని ఇంటి నుంచి వెళ్లింది. రెండు రోజులైనా అక్కడికి వెళ్లలేదు.. గ్రామంలోని ఇంటికి రాలేదు. అనుమానం వచ్చిన బంధువులు పలు చోట్ల వెతికారు. కోడలు(వరుసకు) ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. జానాబాయి ఆచూకీ తెలిసిన వారు 87126 59850 నంబర్‌కు సమాచారం అందించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement