డిచ్‌పల్లి: గ్రామాలను శుభ్రంగా ఉంచాలని డీఎల్‌పీవో డీ శ్రీనివాస్ రావు అన్నారు. ఆదివారం మండలంలోని ధర్మారం(బి)గ్రామంలో ఎంపీవో శ్రీనివాస్‌గౌడ్ తో కలిసి జీపీలో ప్రజాపాలన ప్రగతి నివేదిక 99 రోజుల ప్రణాళికలో భాగంగా తడిచెత్త, పొడిచెత్త పై అవగాహన, కంపోస్ట్ షెడ్ లో సెగ్రీగేషన్ చేయుట, డంపింగ్ యార్డ్ మెంటెనెన్స్, పారిశుద్ధ్య పనులను తనిఖీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ గొట్టిపాటి వాసు, ఉప సర్పంచ్ మహ్మద్ సల్మాన్, జీపీ కార్యదర్శి బాల కృష్ణ, ఐకేపీ మహిళలు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.


