పన్ను వసూళ్లపై నిర్లక్ష్యం తగదు | - | Sakshi
Sakshi News home page

పన్ను వసూళ్లపై నిర్లక్ష్యం తగదు

Mar 9 2026 7:43 AM | Updated on Mar 9 2026 7:43 AM

విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే

షోకాజ్‌ నోటీసులు

మున్సిపల్‌ కమిషనర్‌ దిలీప్‌కుమార్‌

సుభాష్‌నగర్‌: నగరంలోని ఆస్తి పన్నుల వసూళ్లలో నిర్లక్ష్యం తగదని, ఎవరైనా విధుల్లో అలసత్వం ప్ర దర్శిస్తే షోకాజ్‌ నోటీసులు జారీ చేయాలని మున్సిపల్‌ కమిషనర్‌ దిలీప్‌కుమార్‌ ఆదేశించారు. ఆదివా రం నగరంలోని జోన్‌ – 1 కార్యాలయంలో జోనల్‌, నోడల్‌, సూపర్‌వైజర్‌, సపోర్టింగ్‌ స్టాఫ్‌తో పన్నుల వసూళ్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ నగరంలో ఈనెలాఖరు నాటికి రూ.35కోట్ల లక్ష్యాన్ని చేరుకునే లా ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. అందుకనుగుణంగా జోన్‌కు జోనల్‌ ఆఫీసర్‌, నోడల్‌ ఆ ఫీసర్‌, సూపర్‌వైజర్‌తోపాటు సపోర్టింగ్‌ స్టాఫ్‌తో ప్ర త్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ బృందాలు ఉదయం 7 నుంచి సాయంత్రం 7 గంటల వ రకు పన్నుల వసూళ్ల కోసం క్షేత్రస్థాయిలో తిరగాల ని సూచించారు. ఈనెలాఖరు నాటికి లక్ష్యాన్ని చేరు కునేలా చూడాలన్నారు. ఎవరైనా విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆదివారం విధులకు సకాలంలో హాజరు కాని ముగ్గురికి షోకాజ్‌ నోటీసులు జారీ చేసినట్లు కమిషనర్‌ తెలిపారు. అనంతరం జోన్‌–1 పరిధిలో పైప్‌లైన్‌ లీకేజీ మరమ్మతు పనులను స్థానిక ఏఈతో కలిసి కమిషనర్‌ పరిశీలించారు. పనులు నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement