● ప్రభుత్వ సలహాదారు,
బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి
● ఇందూరులో ఘనంగా
అంతర్జాతీయ మహిళా దినోత్సవం
ఖలీల్‌వాడి/ సిరికొండ/ సుభాష్‌నగర్/ మోపాల్/ నిజామాబాద్ రూరల్/ ధర్పల్లి/ నిజామాబాద్ అర్బన్: మహిళల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి అన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం జిల్లా కేంద్రంలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో 150 మంది మహిళలను జిల్లా పీఆర్టీయూ టీఎస్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్ర మం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు మహాలక్ష్మి పథకం అమలు చేశామని, పోలీస్ ఉద్యోగాలు ఇచ్చినట్లు తెలిపారు. పీఆర్టీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శు లు మోహన్‌రెడ్డి, కిషన్ మాట్లాడుతూ పీఆర్టీయూ ఎల్లప్పుడూ మహిళల పక్షపాతిగా ఉంటుందన్నా రు. కార్యక్రమంలో మేయర్ కూరగాయల ఉమారాణి, డీఈవో అశోక్ కుమార్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నగేశ్ రెడ్డి, నుడా చైర్మన్ కేశ వేణు, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు అంకం నరేశ్, సోషల్ మీడియా కన్వీనర్ రవీందర్‌రెడ్డి, అన్ని మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, జిల్లా, రాష్ట్ర బాధ్యులు పాల్గొన్నారు. సిరికొండ మండలంలోని పెద్దవాల్గోట్ జీపీ కార్యాలయంలో మహిళా వార్డు సభ్యులను, మహిళా ఉద్యోగులను సర్పంచ్ పిట్ల వనితనర్సింగ్ ఘనంగా సన్మానించారు. ఉపసర్పంచ్ తలకట్ల రాములు, జీపీ కార్యదర్శి రాజు, కారొబార్ చింటు, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు జాగిరపు నర్సారెడ్డి, లియాఖత్ అలీ తదితరులు పాల్గొన్నారు. నగరంలోని బీసీ డిగ్రీ ఉమెన్స్ హాస్టల్‌లో మహిళా దినోత్సవ వేడుకలను ఐద్వా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఐద్వా జిల్లా కార్యదర్శి బీ సుజాత, రజియా, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. ధర్పల్లి పోలీస్ స్టేషన్‌లో మహిళా కానిస్టేబుల్ మనుషాని సీఐ భిక్షపతి, పోలీస్ సిబ్బంది ఘనంగా సన్మానించారు. జిల్లా కేంద్రంలో తెలంగాణ జాగృతి నాయకులు వివిధ సంస్థల ఉద్యోగులు, వ్యాపారస్తుల మహిళలను సన్మానించారు. కార్యక్రమంలో లక్ష్మీనారాయణ భరద్వాజ్, పంచరెడ్డి మురళి, రేఖ, శోభ, పుష్ప తదితరులు పాల్గొన్నారు. జిల్లా జైలులో మహిళ దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. మహిళా అధికారులను సన్మానించారు. జైలు అధికారులు అశోక్, అనిల్, జిల్లా సంక్షేమ శాఖ అధికారి పద్మ, వైద్యురాలు సవిత, తేజప్వీని, శ్రీరేఖ, స్వరూప తదితరులు పాల్గొన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ప్రతిభ చాటుతున్నారని జిల్లా క్రీడల అధికారి పవన్‌కుమార్ అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా క్రీడాకారులకు వివిధ పోటీలు నిర్వహించారు. కాకతీయ ఒలింపియాడ్ పాఠశాలకు చెందిన విద్యార్థినులు బాస్కెట్ బాల్ పోటీల్లో ఉత్తమ ప్రదర్శన చేపట్టారు. ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్‌లో పలువురు మహిళలను సన్మానించారు. నాయకులు నాగభూషణం, సిరిమల సురేశ్, తెడ్డు గంగారాం తదితరులు పాల్గొన్నారు.


