ఆధ్యాత్మిక చింతనతో మోక్షం | - | Sakshi
Sakshi News home page

ఆధ్యాత్మిక చింతనతో మోక్షం

Mar 9 2026 7:43 AM | Updated on Mar 9 2026 7:43 AM

నిజామాబాద్‌ రూరల్‌: ఆధ్యాత్మిక చింతనతో మోక్షం లభిస్తుందని అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ అన్నారు. ఆదివారం నగరంలోని కంఠేశ్వర్‌ ప్రాంతం, ఇందిరా ప్రియదర్శిని కాలనీల్లో నూతనంగా నిర్మించిన ఇందూర్‌ ఘడ్‌ జగదాంబ – సేవాలాల్‌ మహరాజ్‌ దేవాలయ విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే ధనన్‌పాల్‌ సూర్యనారాయణ, పౌరఘడ్‌ పీఠాధిపతి జితేందర్‌ సింగ్‌ మహరాజ్‌లు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ మాట్లాడుతూ..మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈకార్యక్రమాలను జ్యోషి మధుసూదన్‌ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో నగర మేయర్‌ కూరగాయల ఉమారాణి , రమేశ్‌, 42వ డివిజన్‌ స్థానిక కార్పొరేటర్‌ శశాంక్‌ రెడ్డి, 19వ డివిజన్‌ కార్పొరేటర్‌ నాగోల్ల లక్ష్మి నారాయణ , 39వ డివిజన్‌ కార్పొరేటర్‌ జ్యోతి మురళి, డాక్టర్‌ మెతితాల్‌, పాండ్యరావు, దేవిసింగ్‌, హవాల్‌సింగ్‌, బిలోజీనాయక్‌, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement