● ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి
బోధన్ : బంజారాల ఆరాధ్య గురువు, ఆధ్యాత్మిక మార్గదర్శి సంత్ సేవాలాల్ మహరాజ్ బోధనలను అనుసరించి, సన్మార్గంలో నడవాలని ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి సూచించారు. బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదివారం పాండుఫారం సమీపంలో నియోజకవర్గ స్థాయి సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్నివర్గాల అభ్యున్నతికి కట్టుబడి ఉందన్నారు. పిల్లలను బాగా చదివించి వారు ఉన్నత స్థాయిలో స్థిరపడేలా బంజారాలంతా దృష్టిసారించాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ తూము పద్మశరత్ రెడ్డి, కౌన్సిలర్ లక్ష్మి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు నగేశ్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు పాషా మోహినొద్దీన్, టీపీసీసీ డెలిగెట్ గంగాశంకర్, బంజారా సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు బాబూరాం నాయక్, ప్రతినిధులు చంద్రూ నాయక్, తారాచంద్, యాదగిరి నాయక్ తదితరులు పాల్గొన్నారు.


