యువకుడి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

యువకుడి ఆత్మహత్య

Mar 8 2026 7:56 AM | Updated on Mar 8 2026 7:56 AM

జీవితంపై విరక్తితో మరొకరు.. పిచ్చికుక్క దాడి.. పది మందికి గాయాలు

బాన్సువాడ రూరల్‌: తల్లి మందలించడంతో మనస్తాపం చెందిన యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన బాన్సువాడ మండలం సోమేశ్వర్‌ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. జుక్కల్‌ మండలం మందాబాద్‌తండాకు చెందిన దేవల్ల హనుమంతు (19) నెలరోజులుగా బాన్సు వాడ మండలం సోమేశ్వర్‌ గ్రామంలోని తన మే నత్త వద్ద ఉంటూ కూలి పని చేసుకుంటున్నాడు. ఈ నెల 6న హనుమంతు బీరు తాగుతూ దిగిన ఫొటో ను కుటుంబసభ్యులకు పంపాడు. చిన్నవయసులో బీరు ఎందుకు తాగుతున్నావని తల్లి ఫోన్‌చేసి మందలించింది. దీంతో హనుమంతు సోమేశ్వర్‌ శివారు లోని అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరేసుకున్నాడు. దేవల్ల చిన్నక్క ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు న మోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమి త్తం బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు.

బాన్సువాడ రూరల్‌: మండలంలోని మొగులాన్‌పల్లి గ్రామానికి చెందిన మెగావత్‌ రావణ (40) జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు సీఐ శ్రీధర్‌ తెలిపారు. రావణకు 20 ఏళ్ల క్రితం సునీత అనే మహిళతో వివాహం జరిగింది. రాహుల్‌ అనే కుమారుడు ఉన్నాడు. సునీత కొన్నేళ్లుగా భర్తను వదిలి దూరంగా ఉంటుండగా, రావణ తన కుమారుడితో మొగులాన్‌పల్లితో నివసిస్తున్నాడు. కొంతకాలంగా మద్యానికి బానిసైన రావణ ఈ నెల 5న రాత్రి పొలం వద్ద పురుగుల మందు తాగాడు. చికిత్స నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్‌ తరలించగా చికిత్స పొందుతూ 6న సాయంత్రం మృతి చెందాడు. శనివారం కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీధర్‌ తెలిపారు.

వర్ని: మండలంలోని సత్యనారాయణపురం గ్రామంలో పిచ్చికుక్క స్వైర విహారం చేసి పదిమందిపై దాడి చేసింది. శనివారం ఉదయం రాంమందిర్‌ కాలనీ, బోధన్‌ రోడ్డు, శ్రీనివాస కాలనీలో సుమారు పదిమందిని పిచ్చికుక్క గాయపరిచింది. బాధితులను సర్పంచ్‌ కనకదుర్గ రవి చికిత్స నిమిత్తం బోధన్‌ ఆస్పత్రికి తరలించారు. గ్రామ పంచాయతీ, అధికారులు స్పందించి కుక్కలను తరలించాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement