బిచ్కుంద(జుక్కల్): మండల కేంద్రంలోని మైనార్టీ రెసిడెన్షి యల్ బాలుర పాఠశాల విద్యార్థి ముజాహిద్ (17) శనివారం అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్ష రాసేందుకు ఈ నెల 5న పాఠశాల నుంచి విద్యార్థులతో కలిసి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉన్న కేంద్రానికి ఆటోలో వెళ్లాడు. పరీక్ష రాసిన తర్వాత తోటి విద్యార్థులతో కలిసి తిరిగి పాఠశాలకు రాలేదు. సాయంత్రం వరకు రాకపోవడంతో ప్రిన్సిపల్ స్వామికు టుంబసభ్యులకు సమాచారం అందించగా, వారు శుక్రవారం బిచ్కుంద పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. శనివారం చిన్నదడ్గి వాగులో ముజాహిద్ మృతదేహమై కనిపించాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. విద్యార్థి మృతిపై మైనార్టీ స్కూల్ పర్యవేక్షణ జిల్లా అధికారి బషీర్ పాఠశాలలో విచారణ చేపట్టారు. కాగా, విద్యార్థి మృతిపై ఎమ్మెల్యే లక్ష్మికాంతారావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బిచ్కుందలో విద్యార్థి కుటుంబసభ్యులతో కలిసి మాట్లాడారు. ప్రభుత్వం నుంచి రూ.2 లక్షలు ఆర్థిక సహాయం అందేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు.
సిరికొండ: మండలంలోని పందిమడుగు అటవీ సెక్షన్ చీమన్‌పల్లి బీట్ నుంచి అక్రమంగా బండరాళ్లు తరలిస్తున్న ట్రాక్టర్‌ను శనివారం పట్టుకున్నట్లు సిరికొండ ఎఫ్‌ఆర్వో నర్సింగ్‌రావు తెలిపారు. అనుమతి లేకుండా తరలిస్తున్నందున ట్రాక్టర్‌ను సీజ్ చేశామన్నారు. బండరాళ్లను తరలిస్తున్న శాంతం, ఆలకుంట చిన్న ఎల్లయ్యలపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న రాళ్ల విలువ రూ.15,433 ఉంటుందని పేర్కొన్నారు. ఆయన వెటం డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ గంగారాం, సెక్షన్ అధికారి కృష్ణగీత్, బీట్ అధికారులు హరీశ్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.


